Advertisements

నేడే హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసినా కార్మికులు ఇంకా సమ్మెలోనే కొనసాగుతున్నారు. దీంతో ఇవాళ కోర్టులో విచారణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బకాయి లేదని ఆర్థిక శాఖ తెలిపింది. మరోవైపు స్వయంగా తమ ముందుకు రావాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు.ఈ క్రమంలో ఇవాళ జరిగే విచారణకు సీఎస్‌ ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి,ఆర్టీసీ ఎండీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హాజరుకానున్నారు.5వేల బస్సులకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ కూడా ఇవాళ విచారణకు రానుంది.

%d bloggers like this: