Advertisements

మా ఎమ్మెల్యేలంతా పార్టీకి కట్టుబడి ఉన్నారు

 శివసేన ఎమ్మెల్యేలతో ఇవాళ ఉద్ధవ్ థాకరే సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శివసేన ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై రావత్ స్పందిస్తూ.. ‘‘మాకు ఆ అవసరమే లేదు. మా ఎమ్మెల్యేలంతా పార్టీకి కట్టుబడి ఉన్నారు. ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తున్న వాళ్లు ముందు తమ ఎమ్మెల్యేల గురించి జాగ్రత్త పడితే మంచిది..’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మధ్య ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని కూడా రావత్ స్పష్టం చేశారు. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుందామని శివసేన ప్రతిపాదించడం… అందుకు బీజేపీ ససేమిరా అనడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
%d bloggers like this: