Advertisements

రుణం.. రణం.. జల జగడం!

ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిపై కేసీఆర్-కిషన్‌రెడ్డి-సంజయ్ వార్
కేంద్ర నిర్ణయంపై కే సీఆర్ కన్నెర్ర
రైతుబంధు షరతుల సంగతేమిటన్న కిషన్‌రెడ్డి, సంజయ్
జల ప్రాజెక్టులపై రేవంత్, ఉత్తమ్, పొన్నం జగడం
సర్కారుకు వ్యతిరేకంగా తెలంగాణ పార్టీల సమరం
తెలంగాణ రాజకీయాల్లో త్రికోణ యుద్ధం
(మార్తి సుబ్రహ్మణ్యం)
కీలకమైన రెండు అంశాలపై తెలంగాణలో.. అధికార-విపక్షాల మధ్య జరుగుతున్న జరుగుతున్న సమరం ఆసక్తిక రంగా మారింది. ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితిపై కేంద్రం విధించిన షరతులను సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తుండగా, కేసీఆర్ ప్రభుత్వం.. రైతులకు పంటలపై విధించిన రైతుబంధు షరతులను బీజేపీ-కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఇక ఏపీ సీఎం జగన్ సర్కారు పోతిరెడ్డిపాడుపై ఇచ్చిన ఉత్తర్వులకు నిరసనగా కాంగ్రెస్-బీజేపీ-తెలంగాణ పార్టీలు ఉద్యమబాట పడుతున్నాయి. అనేక అంశాల్లో విపక్షాలపై ఎదురుదాడి చేయడంలో పైచేయి సాధిస్తున్న అధికారపక్షం.. పోతిరెడ్డిపాడు విషయంలో మాత్రం విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. అటు వైపు నుంచి వినిపిస్తున్న స్వరాలు బలహీనంగా ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎంపి రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భ ట్టి విక్రమార్క; బిజెపి దళపతి సంజయ్, రామచందర్‌రావు, రఘునందన్‌రావు, డికె అరుణ, సంకినేని వెంకటేశ్వరరావు అధికారపక్షంపై మాటలతూటాలు విసురుతున్నారు. కోదండరాం, రాణిరుద్రమ, జోత్స్న, జిట్టా బాలకృష్ణారెడ్డి వంటి తెలంగాణ నేతలు సైతం.. పోతిరెడ్డిపాడు అంశంలో, కేసీఆర్ సర్కారు వైఫల్యంపై విరుచుకుపడతుండటంతో రాజకీయం వేడెక్కింది.
కేంద్ర షరతులపై కేసీఆర్ కన్నెర్ర..
చాలాకాలం తర్వాత.. నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై చాలాకాలం తర్వాత యుద్ధం ప్రకటించారు. కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ, ఎఫ్‌ఆర్‌బీఎం షరుతులు, కేంద్ర విద్యుత్ సంస్కరణలపై కత్తిదూశారు. ప్యాకేజీ పేరుతో దగా, మోసం చేసిందని కన్నెర్ర చేశారు. విద్యుత్ సంస్కరణలు ఎట్టి పరిస్థితిలో అమలుచేసేది లేదని ఖరాఖండీగా చెప్పారు. ఆ ముష్టి 2500 కోట్లు తీసుకోబోమని తెగేసి చెప్పారు. శిశుపాలుడి వంద తప్పులు మన్నించిన్రు కదా? పాపాలు పండే సమయం వస్తుందని నిప్పులు చెరిగారు.
అవన్నీ దరిద్రపు షరతులేనన్న కేసీఆర్..
ప్రధానంగా రుణ షరతులపై కేసీఆర్ కేంద్ర తీరును దునుమాడారు. ‘ఎఫ్‌ఆర్‌బీఎం రుణం రెండు శాతం పెంచడం వల్ల, తెలంగాణకు 20వేల కోట్ల రూపాయల అదనపు రుణం మాత్రమే వస్తుంది. దాని షరతులు చూస్తే నవ్వుతారు. ఆ బాకీ చెల్లించుకోవలసింది ప్రభుత్వమే. అవి తెచ్చుకోవాలంటే కేంద్రం పెట్టిన దరిద్రపు షరతులన్నింటినీ ఒప్పుకోవాలి. ప్రజలమెడపై కత్తి పెట్టి విద్యుత్ సంస్కరణలు తెస్తే, 2500 కోట్లు ఇస్తారంట. ఇది సమాఖ్య వ్యవస్థలో అనుసరించే పద్ధతి కాదు. మార్కెట్ కమిటీల్లో సంస్కరణలు తెస్తే ఇంకో 2500 కోట్లు ఇస్తారంట. మునిసిపాలిటీల్లో పన్నులు పెంచితే 2500 కోట్లు ఇస్తారంట. దీనిని ప్యాకేజీ అంటారా? అన్ని అధికారాలు కేంద్రమే తీసుకుంటే, ఇక రాష్ట్రం ఎందుక’ని కేసీఆర్ చేసిన గర్జన, కేంద్రంపై సమర శంఖం పూరించినట్లే ఉంది. ఆరకంగా..కేంద్రం ఇచ్చే నిధులు మాకు అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పిన సీఎంగా కేసీఆర్ నిలిచిపోయారు.
కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఎదురుదాడి..
కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకు దూరంగా ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. తాజాగా కేసీఆర్‌పై చేసిన దాడిపై ఎదురుదాడి చేసి, తెరాసతో యుద్ధానికి తెరలేపారు. కేంద్ర షరతులను వ్యతిరేకిస్తున్న కేసీఆర్.. రైతుబంధుపై ఎలా షరతు విధించారన్న లాజిక్కుతో, తెరాస సర్కారును ఆత్మరక్షణలో నెట్టి, మిగిలిన పక్షాలకు కొత్త ఆయుధం అందించారు.కేసీఆర్ మాటల తీరును దు
య్యబట్టిన కిషన్‌రెడ్డి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
కేసీఆర్ నియంత.. ఫ్యూడలిస్టు..
‘కేసీఆర్ నియంత, ఫ్యూడలిస్టుగా మాట్లాడుతున్నారు. ప్యాకేజీ, ప్రధానిపై ఆయన చేసిన విమర్శలు సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయి. కేసీఆర్ భాషను తెలంగాణ సమాజం సమర్ధించదు. సంస్కరణల కోసం ఎఫ్‌ఆర్‌బీఎంలో ఆంక్షలు పెడితే విమర్శించిన కేసీఆర్, రైతుబంధు పథకంలో మాత్రం షరతులు పెట్టవచ్చా? నాలుగు నిబంధనలకు గాను రెండింటిని అమలుచేయడంలో ఇప్పటికే ముందున్నామంటున్నారు. మరి మిగిలిన రెండు సంస్కరణల్లో మాత్రం ఎందుకు ముందుండరు? మున్సిపాలిటీలు స్వయంసంవృద్ధి సాధించేందుకు ఆంక్షలు పెడితే తప్పేమిటి? చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు ఇవ్వనంటూ రైతుల మెడపై కత్తిపెట్టిందెవరు? భిక్షం వేయడానికి కేంద్రం నిజాం నవాబు అడుగుజాడల్లో నడవటం లేదు. అడ్రసులేని పత్రికలను పట్టుకుని ప్రధానిపై విమర్శలు చేస్తారా? కొత్త విద్యుత్ చట్టంలో నిబంధనలు అమలుచేసేందుకు అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా ఆమోదం తెలిపి, ఇప్పుడు అడ్డంగా మాట్లాడటం ఏం పద్ధతి’ అని కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.
రైతుబంధు, రుణమాఫీపై కమలం సమరం
ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే.. రైతుబంధు పథకం వర్తించదన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై, కమలం సమరశ ంఖం పూరించింది. రైతుబంధు కింద డబ్బులను రైతులందరి ఖాతాలో వేయాలని, కేసీఆర్ 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్లు.. లక్షరూపాయల రుణమాఫీని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి  బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ చెప్పిన పంటలే వేయాలనడం నియంతృత్వం. అప్రజాస్వామ్యం.  ఆయనేమైనా సైంటిస్టా? కరోనా విషయంలో కూడా తెలంగాణలో కరోనా రాదని పైద్ద సెంటిస్టులా చెప్పారు. మాస్కులు అవసరం లేదన్నారు.  మరి ఇప్పుడు ఏమైంది? ఏ జిల్లాలో ఏ నేల ఎలాంటిదో కేసీఆర్‌కు తెలుసా? పంటలపై రైతులకు షరతు విధించిన కేసీఆర్‌కు, కేంద్రం సంస్కరణల కోసం విధించిన షరతులను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిద’ని సంజయ్ నిలదీశారు. ఈవైఖరికి నిరసనగా, బీజేపీ రాష్ట్రంలోని తహశీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు.
పోతిరెడ్డిపాడుపై పట్టు విడవని రేవంత్‌రెడ్డి
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులర్ సామర్థ్యం పెంచుతూ.. ఏపీ సీఎం జగన్ సర్కారు ఇచ్చిన ఉత్తర్వుపై, కాంగ్రెస్ యువ ఎంపి రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌పై తన యుద్ధం కొనసాగిస్తున్నారు. ఈ అంశంలో ఆయన కేసీఆర్-జగన్ బంధాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రగతిభవన్‌లో కేసీఆర్-జగన్  బంతిభోజనం తిన్న తర్వాతనే పోతిరెడ్డిపాడు జీఓకు ప్రాణం పోసుకుంది. ఆ భేటీ ఏమిటన్నది తెలంగాణ సమాజానికి తెలిసితీరాలి. వైఎస్ మంత్రివర్గంలో టీఆర్‌ఎస్ చేరినప్పుడు, నాయని నర్శింహారెడ్డి కడప జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నప్పుడే  పోతిరెడ్డిపాడుకు అనుమతులిచ్చారు. అప్పుడు కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారు. నాడు దానిపై పోరాడింది పిజెఆర్-శశిధర్‌రెడ్డి మాత్రమే. అప్పుడు బెల్లంకొట్టిన రాయిలా కూర్చుని ఇప్పుడు పెద్ద పెద్దమాటలు మాట్లాడుతున్నారు. అప్పట్లో చంద్రబాబుకు చెప్పులు మోసింది. వైఎస్‌కు మూటలు మోసింది కేసీఆరే. అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నది కూడా ఆయనే. మాగం రంగారెడ్డి ఎమ్మెల్సీ కోసం, కేసీఆర్ ఎమ్మెల్యేలను అమ్ముకున్నారు. ఏపీకి కేటాయించిన నీళ్లనే తీసుకువెళుతున్నానని జగన్ చెబుతుంటే, కేసీఆర్ దానిని సమర్ధిస్తున్నారు. దీనిపై కుట్ర ఉంది. కమిషన్లకు కక్కుర్తి పడి కొత్త విద్యుత్ ప్రాజెక్టు ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే నీటి తరలింపును కేసీఆర్ సమర్ధిస్తున్నారు. 2016లో పత్తిపంట వేయవద్దన్న కేసీఆర్, ఇప్పుడు పత్తివేయకపోతే రైతుబంధు ఇవ్వనంటాడు. అంతా ఆయనిష్టమేనా? మీడియాను ప్రశ్నలు వేయకుండా, ఆయనే ఎదురుదాడి చేసి నోళ్లు మూయిస్తున్నారు. మీడియా కూడా ఈ విధానాన్ని ప్రశ్నించాలి. కేసీఆర్ తానా అంటే తందానా అనే రోజులు పోయాయి. మీడియా మౌనంగా ఉంటే, సోషల్‌మీడియా కేసీఆర్ నిజరూపం బయటపెట్టితీరుతుంద’’ని రేవంత్  విరుచుకుపడుతున్నారు.
కేసీఆర్‌పై వివేక్, పొంగులేటి ఎదురుదాడి
కేంద్రంపై మాటల దాడి చేసిన కేసీఆర్‌పై.. బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎదురుదాడి ప్రారంభించారు. పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ మౌనాన్నీ దునుమాడారు. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం నుంచి నీళ్లు తీసుకుంటానని జగన్ ఆర్నెల్ల క్రితమే చెప్పినప్పుడు.. కేసీఆర్ ఎందుకు నోరు మూసుకున్నారని నిలదీశారు. దానిపై విపక్షాలు ప్రశ్నించిన తర్వాతే సీఎం స్పందించారన్నారు. పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు వైఎస్ దొంగ, దుర్మార్గుడు అన్న సీఎం.. ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి జగన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, దానిపై మాట్లాడటం లేదని విరుచుకుపడ్డారు.
కమిషన్ల కోసమే ప్రాజెక్టులు..
revanth comments
‘36 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్ల పెంచారు. దానికింద ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలి. ఆయన ఇరిగేషన్ రంగాన్ని దందాగా మార్చారు. మాఫియా మాదిరిగా డబ్బులెలా సంపాదించాలని చెప్పి అవగాహన కుదుర్చుకున్నారు. మేఘా కృష్ణారెడ్డి మాటలు విని, కాళేశ్వరం ప్రాజెక్టులో లిఫ్టులు, మోటార్లు ఎక్కువపెట్టి ఎక్కువ ఖర్చు చేశారు. ఈ సలహా జగన్‌కు ఇచ్చి సంగమేశ్వరంలో లిఫ్టు ప్రాజెక్టు పెట్టుకోమని చెప్పింది కేసీఆర్ కాదా? గత వానాకాలంలో ఎస్సారెస్పీకి వచ్చిన నీళ్లనే కాళేశ్వరం నీళ్లన్నట్లు చెప్పడం పచ్చి మోసం. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ లేఖ రాసినా కేసీఆర్ నోరు మూసుకుని కూర్చుంటున్నారు. ప్రతిపక్షాలమీద అన్ని విమర్శలు చేసిన కేసీఆర్, జగన్‌మీద ఒక్క విమర్శ కూడా చేయలేదు. పోలవరం బ్యాక్‌వాటర్‌లో రాముడు ఇటు ఉంటాడు, రాముడి ఆస్థి పురుషోత్తపట్నంలో ఉంటుంది. నోరు ఎటు తిరిగితే అటు మాట్లాడతారా? ప్రతిపక్షం, పత్రికలు మాట్లాడవద్దు. మీరు తానా అంటే మేమంతా తందానా అనాలా?  కేంద్రం రాష్ట్రాలకు రుణాలు ఎక్కువ ఇవ్వడం లేదన్న కేసీఆర్, ఈ ఆరేళ్లలో 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. మొత్తం 60 ఏళ్లలో తెలంగాణకు ఉన్న అప్పు60 వేల కోట్లయితే, ఆరేళ్లలో 3 లక్షల కోట్లు అప్పు ఎలా తీసుకురాగలిగారు? దానివల్ల ఒక్కో తెలంగాణ పౌరుడికి గతంలో 15వేల భారం ఉంటే, దానిని లక్షరూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్‌దే. ఇప్పుడు రుణం తీసుకుంటే మళ్లీ ఆ భారం ప్రజలపైనే పడుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తాం’ అని వివేక్, పొంగులేటి  ఘాటుగా బదులిచ్చారు.

https://www.facebook.com/154923744535291/videos/553576328928319/

One thought on “రుణం.. రణం.. జల జగడం!

Leave a Reply

%d bloggers like this: