Advertisements

ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్ష

లాక్‌డౌన్‌పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు
లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసరాలకోసం ప్రజలు ఒకే సమయంలో పెద్దఎత్తున గుమిగూడ్డంపై చర్చ
కోవిడ్‌ నివారణకు సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశం దీనివల్ల దెబ్బతింటోందని సమావేశంలో చర్చ
ప్రజల్లో నిత్యావసరాలు దొరకడంలేదనే ఆందోళన లేకుండా చేయడానికి, అదే సమయంలో సామాజిక దూరం పాటించేలా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చ

సమావేశంలో నిర్ణయాలు:

నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని నిర్ణయం
ఒకేచోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం
ఈ దుకాణాలు నిర్ణీత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం
అలాగే ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయాలని నిర్ణయం
అలాగే నిత్యావసరాల దుకాణాల వద్ద కూడా ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కింగ్‌ చేయాలని నిర్ణయం
కూరగాయలు, నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ అనుమతించాలని నిర్ణయం
ప్రజలు నిత్యావసరాలకోసమే బయటకు రావాలి
ఎవ్వరూ కూడా 2–3 కి.మీ పరిధి దాటిరాకూడదు
ఆమేరకు నిత్యావసరాలు వారికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి
పాలు లాంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలి
నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు…సమర్ధించిన జగన్

144 సెక్షన్‌ రోజంతా అమల్లో ఉంటుంది
నలుగురికి మించి ఎవ్వరూ కూడా ఎక్కడా గుమి కూడరాదు
అలాగే సప్లై చెయిన్‌ దెబ్బతినకుండా గూడ్స్‌ వాహనాలు, నిత్యావసరాలు తీసుకొచ్చే వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలని నిర్ణయం
కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లను కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలని జగన్‌ నిర్ణయం
ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే… 1902 కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేయాలి
కాల్‌సెంటర్‌లో ఒక సీనియర్‌ అధికారిని పెట్టండి
ఫిర్యాదులు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోండి
తీసుకున్న కఠిన చర్యలను కూడా పబ్లిసైజ్‌ చేయాలి
నిల్వచేయలేని పంటల ఉత్పత్తుల విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న జగన్‌
ప్రజలకు నిత్యావసరాలు అందించడంలో కీలక పాత్ర పోసిస్తున్న హమాలీలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని సమావేశంలో నిర్ణయం

కోవిడ్‌ నివారణ చర్యలకు వైయస్సార్‌సీపీ ఎంపీల విరాళం:

ప్రధాని సహాయ నిధికి ఒక నెల జీతం, సీఎం సహాయ నిధికి మరో నెల జీతం విరాళం
కరోనా కారణంగా మానవాళికి తీవ్ర సంక్షోభం తలెత్తింది: వైయస్సార్‌సీపీపీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ నేత పి.వి.మిథున్‌ రెడ్డి
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది, అధికారులు విశేషంగా సాహసోపేతంగా పనిచేస్తున్నారు
ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికి పరిమితం కావడం అత్యవసరం
రోజూ పనిచేస్తేగాని పొట్టగడవని వారికి అన్నిరకాల సహాయం అవసరం
అండగా ఉండేందుకు ప్రధాని, సీఎం సహాయ నిధులకు విరాళాలు ఇస్తున్నాం
భారసారూప్యత ఉన్న వ్యక్తులు కూడా తమ వంతు సహాయాన్ని అందించాలి

Leave a Reply

%d bloggers like this: