ఈనెల 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
ఈ నెలలోనే మరో 10 వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. టాటానగర్-పాట్నా, వారణాసి-దియోఘర్, రాంచీ-గొడ్డ, దుర్గ్-విశాఖపట్నం, టాటానగర్-బెర్హంపూర్ (ఒడిశా) రూర్కెలా-హౌరా, హౌరా-గయా, ఆగ్రా-వారణాసితో సహా కీలక మార్గాల్లో కనెక్టివిటీని మరింత విస్తరించనున్నారు. రైల్వే వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో భాగంగా ఈ కొత్త రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. ఈనెల 15న ప్రధాని మోదీ ఈ ట్రైన్లను వర్చువల్గా ప్రారంభిస్తారు.