Suryaa.co.in

Telangana

జిల్లాల అభివృద్ధికి 2 శాతం సీఎస్‌ఆర్‌ ఫండ్స్ ఇవ్వాలి

– కంపెనీలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి

సంగారెడ్డి: జిల్లాలో ఉన్నా కంపెనీలు ఆయా జిల్లాల అభివృద్ధికి రెండు శాతం సీఎస్‌ఆర్‌ ఫండ్స్ ను తమవంతు బాధ్యతగా విడుదల చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కంపెనీ ప్రతినిధులకు, యాజమాన్యాలకు కోరారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లో ఉన్న అతి పెద్ద, పెద్ద అండ్‌ మధ్య స్థాయి కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం లో కలెక్టర్‌ క్రాంతి వల్లూరుతో కలిసి పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా లో సామాజిక, విద్యా , వైద్య రంగాల అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ ఫండ్స్ కేటాయింపుల పై చర్చించారు. గతంలో ఫండ్స్ తో చేపట్టిన పనులను వెంటనే పూర్తి అయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE