Suryaa.co.in

Month: September 2024

బాధితులను ఆదుకోవడంలో మేము సైతం..

-25,000 మంది బాధితులకు టమాటా బాత్ ప్యాకెట్లు పంపిన రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు రాజమహేంద్రవరం: విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు మేము సైతం అంటూ పెద్ద మనసుతో సాయానికి ముందడుగు వేశారు. జైలు పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ నేతృత్వంలో పాతిక వేల మందికి టమాటా బాత్ (ఉప్మా) ప్యాకెట్లు…

రేపటి నుండి నిత్యావసర వస్తువుల పంపిణీ

• మంత్రులు నారాయణ, సవిత వెల్లడి • 54 డివిజన్ లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిన మంత్రులు • వించిపేట ఉర్దూ పాఠశాలను శుభ్రం చేసిన నారాయణ, సవిత విజయవాడ: శుక్రవారం నుంచి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నట్లు మంత్రులు నారాయణ, సవిత వెల్లడించారు. గురువారం నగరంలోని 54 డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్, వించిపేట,…

వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీ

* రేషన్ కార్డు లేనివారికి ఆధార్ కార్డు ద్వారా పంపిణీ * రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 25 కిలోలు…

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో తెలంగాణ ముందంజ

-త్వరలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ -లాభాపేక్షలేని సంస్థలతో 26 అవగాహన పత్రాలు -గ్లోబల్ ఏఐ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్: గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2024, తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యమివ్వగా, హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ )లో గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల…

వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న పవన్ కళ్యాణ్

– జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు…

ఉపాధ్యాయులు దైవ స్వరూపులు

సీఎం చంద్రబాబునాయుడు విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్ 5న గురు పూజా దినోత్సవం జరుపుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తుంటాము. పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. అందుకే వారిని దైవస్వరూపులుగా భావిస్తుంటాం. ఎంతో…

జోగి రమేశ్ కోసం పోలీసుల గాలింపు

విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇటీవల ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు. దీంతో జోగి, ఆయన అనుచరుల కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు…

బాబుకు తప్పిన పెను ప్రమాదం

-రైల్వే ట్రాక్ ఎక్కిన బాబు -అంతలోనే దూసుకు వచ్చిన రైలు -బాబును అప్రమత్తం చేసిన సెక్యూరిటీ -ఎర్రజెండా ఊపిన ట్రాక్‌మెన్ -వరద పరిశీలనలో బాబుకు తప్పిన ప్రమాదం -ఊపిరిపీల్చుకున్న నేతలు, అధికారులు విజయవాడ: వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం మధురానగర్ పరిసరాల్లో పర్యటించిన ఆయన, అక్కడి పరిస్థితులను…

సహాయక చర్యల్లో పెమ్మసాని ఫౌండేషన్

– రాయపాడు పునరావాస కేంద్రాల్లో రగ్గులు, వాటర్ క్యాన్ల పంపిణీ తాడికొండ: గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పెమ్మసాని ఫౌండేషన్ నిర్వాహకులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నిర్విరామంగా వరద బాధితులకు చేయూతనిస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులు తాజాగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాడికొండ నియోజకవర్గంలోని రాయపూడి మండలం, పెదలంకలో 250 కుటుంబాలకు…

ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ గేట్లను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గురువారం పరిశీలించారు. గేట్ల మరమ్మతుల పనుల వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర మంత్రికి జరుగుతున్న పనులు, వరద ఉద్ధృతి వివరాలను మంత్రి లోకేష్ వివరించారు. కేంద్ర మంత్రి పర్యటనలో కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, తదితరులు పాల్గొన్నారు.