– అందులో 25 మందిని గుర్తించాం
– 90మంది భక్తులకు గాయాలు
– డీఐజీ వైభన్ కృష్ణ
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు చనిపోయారని ఆ రాష్ట్ర డీఐజీ వైభన్ కృష్ణ ప్రకటించారు. అందులో 25 మంది భక్తులను గుర్తించామని, మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందన్నారు. ఆస్పత్రిలో 90 మంది భక్తులు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్యలో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్ 1920ను సంప్రదించాలని సూచించారు.