– రైతులకు 31 వేల కోట్ల రుణమాఫీ
– పత్తి, ధాన్యం కొనుగోలు వేగవంతం
– ప్రతి మండల కేంద్రంలోనూ గ్రంధాలయం
– ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందిస్తాం
– తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
మేడ్చల్: దేశంలో ఎక్కడలేని విధంగా ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లాలోని కూకట్పల్లి, మేడ్చల్ నియోజకవర్గం పర్యటించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. అలాగే మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ్మ యాదవ్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, రాష్ట్ర మహిళా సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి తదితరులతో కలిసి పాల్గొన్నారు.
రూ. కోట్ల 34 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు కూకట్పల్లి తాసిల్దారు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావుతో కలిసి 504 మంది మహిళలకు రూ. 5 కోట్ల పైచిలుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని చెప్పారు. రైతులకు రుణమాఫీలో భాగంగా 31 వేల కోట్ల నిధులతో రెండు లక్షల రుణాలు మాఫీ చేసిన్నట్లు చెప్పారు. సాంకేతిక కారణాలతో పలువురు రైతులకు రుణమాఫీ జరగలేదని త్వరలోనే అది పూర్తవుతుందని అన్నారు. ప్రస్తుతం ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలలో రైతులు పండించిన ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ కొనువులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. మార్కెట్ కమిటీ పాలక వర్గం రైతుల అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయం చైర్మన్ డాక్టర్ రియాజ్,తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభా రాణి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ కొల్లాన్ హనుమంత్ రెడ్డి,రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపాతి రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సరిత వెంకటేష్,తెలంగాణ రాష్ట్ర హాజ్ కమిటీ మెంబెర్ మహమ్మద్ ముజీబుద్దీన్,మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బొమ్మలపల్లి నర్సింహా యాదవ్,మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ ఛైర్మెన్ దీపాక నర్సింహా రెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ యాదవ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్,జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్,మేడ్చల్ నియోజకవర్గం మండల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.