బంగ్లాదేశ్ లో భారీ నౌకకు అగ్ని ప్రమాదం..

-40మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌లో ఓ భారీ నౌకకు అగ్ని ప్రమాదం జరగడంతో 40 మంది మరణించారు. 100 మంది
గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఝలాకటి జిల్లాలోని ఓ నదిలో జరిగింది. ఇది ఢాకాకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణం సంభవించింది. ఈ నౌక ఢాకా నుండి బర్గునా జిల్లాకు వెళుతుండగా అగ్ని ప్రమాదానికి గురైందని ఝలాకటి జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తెల్లవారుజామున బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోకతి సమీపంలోని సుగంధ నదిపై మూడు అంతస్తుల నౌక ప్రయాణం చేస్తుండగా.. మంటలు
218238-ferry-fire-accident చెలరేగాయి.. నిమిషాల వ్యవధిలోనే పూర్తిస్థాయిలో నౌక మొత్తం వ్యాపించాయి మంటలు.. ఈ ఘటనలో 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 40 మృతదేహాలను వెలికితీశామని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. మంటలకు భయపడి కొందరు నదిలోకి దూకేశారని.. నీటిలో మునిగి మరికొందరు మరణించారని స్థానిక పోలీసు చీఫ్ మొయినుల్ ఇస్లాం వెల్లడించారు.

నౌకలో 310 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ కనీసం 500 మంది ప్రయాణం చేస్తున్నారని.. వీరిలో చాలామంది రాజధాని నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నారని.. దాదాపు 100 మందిని కాలిన గాయాలతో బారిసాల్‌లోని ఆస్పత్రులకు తరలించామని తెలిపారు అఇకారులు.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నౌకలో మంటలు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.. మేం గ్రౌండ్ ఫ్లోర్ డెక్‌పై చాప మీద నిద్రిస్తున్నాము. ప్రయాణీకులందరూ నిద్రిస్తున్నారు.. నా తొమ్మిదేళ్ల మనవడు కూడా
unnamedఉన్నాడు.. మంటల ధాటికి నా మనవడు నదిలోకి దూకాడు, అతనికి ఏమి జరిగిందో తెలియదంటూ ఓ వృద్ధురాలు కన్నీరు మున్నీరైంది.. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చాలా మంది ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతమంది నిద్రిస్తున్న క్యాబిన్ల నుండి బయటకు రాలేకపోయారని.. చాలా మంది నదిలోకి దూకారాని.. బరిసాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న మరో వ్యక్తి వెల్లడించారు. మంటలు చెలరేగిన గంటలోపే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టామని జిల్లా పాలనాధికారి జోహార్ అలీ తెలిపారు. ప్రయాణికులతో మాట్లాడాం.. 500 నుంచి 700 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నట్టు తెలిపారు.

Leave a Reply