Advertisements

అనంతపురం జిల్లాలో పంచాయితీ రాజ్ శాఖ ఏఈ కొండసాని సురేష్ రెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు.సురేష్ గతంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి పీఏగా పనిచేశారు. జేసీ మంత్రిగా ఉన్న సమయంలో సురేష్ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. సురేష్ రెడ్డి అవినీతిపై సమాచారం అందడంతో అనంతపురంలోని రామ్ నగర్ , పుట్టపర్తి, బేతంచర్లలోని మూడు ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసి సోదాలు జరిపారు. కోట్లు విలువ చేసే అపార్ట్ మెంట్లు,  స్థలాలకు సంబంధించి డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సురేష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.