నేను మీకు హామీ ఇస్తున్నా...వారందరినీ బయటకు పంపించేస్తాం

జార్ఖండ్‌లో నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... దేశంలో అక్రమంగా నివసిస్తున్న చొరబాటు దారులందరినీ 2024లోపు సరిహద్దు బయటికి పంపించేస్తామని  అన్నారు.ఎన్‌ఆర్‌సీని దేశం మొత్తం అమలు చేస్తామని, చొరబాటులను అణచివేస్తామని చెప్పారు.‘‘ఈ దేశం నుంచి జార్ఖండ్ నుంచి చొరబాటు దారులు అందరినీ పంపించేస్తాం. కానీ, రాహుల్ బాబాకు ఇది ఇష్టం లేదు. వాళ్లు ఎక్కడికి వెళ్తారు? ఏం తింటారు? అని అడుగుతున్నారు. కానీ, నేను మీకు హామీ ఇస్తున్నాను. 2024 లోపు క్రమక్రమంగా దేశంలోని చొరబాటు దారులందరినీ సరిహద్దు బయటకు పంపించేస్తాం’’ అని అమిత్ షా అన్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X