పచ్చదనం పెంపులో రాష్ట్రం అగ్రగామి

రాష్ట్రం అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్) ఎన్.ప్రతీప్ కుమార్ (ఐఎఫ్‌ఎస్)

పచ్చదనం పెంపులో, అడవుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర పర్యావరణ,అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అభిప్రాయపడినట్లు రాష్ర్ట అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్.ప్రతీప్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రత్యామ్నాయ వనీకరణ నిర్వహణ ప్రణాళిక సంస్థ( కంపా) సమావేశంలో పాల్గొన్న అనంతరం మంగళవారం భారత ప్రభుత్వ డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ సిద్ధాంతదాస్(ఐఎఫ్‌ఎస్) తో పీసీసీఎఫ్ ఎన్.ప్రతీప్‌కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.రాఫ్ట్రంలో రూ.360 కోట్ల కంపా నిధులతో మొక్కల పెంపకంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని ఆ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని ఆయన వివరించారు. పచ్చదనం పెంపు విషయంలో ఆంధ్ర ప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారులు మిగతా రాష్ట్రాలవారికి వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ర్టంలో మొక్కల పెంపకానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని, దీనికి తోడు భూగర్భ జల మట్టం పెరగడంతో తేమ పెరిగి మొక్కల సంరక్షణకు అనువైన వాతావరణ ఏర్పడిందని ఆయన తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లో అడవుల శాతం ఎంత పెరిగిందనే విషయాన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా గతంలో వెల్లడించిన సమాచారం ప్రకారం గ్రీన్‌కవర్ లో ఇండియాలోనే ఏపీ నంబర్‌వన్‌గా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా సమావేశంలో గుర్తు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో అడవుల శాతం ఎంత పెరిగిందనే విషయంలో విశ్లేషణాత్మక సమాచారం కేంద్రానికి అందజేయడం జరిగిందని పీసీసీఎఫ్ ప్రతీప్‌కుమార్ వివరించారు.గతంలో స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ లో కూడా ఏపీ అగ్రగామిగా నిలవడం తమ సిబ్బంది నిబద్దతే కారణమని ఆయన తెలిపారు. మొక్కలు నాటడమే కాక ప్రతిమొక్క పెరిగేవరకు చూసే బాధ్యతను క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పజెప్పడం జరిగిందన్నారు. గ్రీన్‌కవర్ పెంచే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అందుకు అనుగుణంగా ముందుకుపోతున్నామని తెలిపారు.రాష్ర్టంలోని 13 జిల్లాలలో వేలాది హెక్టార్‌లలో ప్లాంటేషన్ చేయడానికి వివిధ స్కీంల కింద నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.షెల్టర్ బెడ్ ప్లాంటేషన్స్,మడ అడవుల పెంపకం,రహదారుల చుట్టూ ఎవెన్యూ ప్లాంటేషన్స్, బ్లాక్ ప్లాంటేషన్ అభివృద్ధి, బోడి కొండలు మొదలగు విధంగా గ్రీన్‌కవర్ పెంచడానికి తమ సిబ్బంది కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X