విశాఖకు మెట్రో

ఎన్నో రోజులుగా విశాఖకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ తీసుకురావాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే.గతంలో విశాఖ మెట్రో గురించి కొన్ని చర్చలు జరిగాయి కానీ, ముందుకు సాగలేదు.  కాగా, ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ మెట్రోపై సమీక్ష జరిపి విశాఖ మెట్రో గురించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. విశాఖలో 10 విడతల్లో 10 కారిడార్లలో మొత్తం 140.13 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఫస్ట్ పేస్ లో మొత్తం 4640 కిలోమీటర్లు, స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.23 కిలోమీటర్లు, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వాకు 5.26 కిలోమీటర్లు, తాడిచెట్ల పాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు 6.91 కిలోమీటర్లు మెట్రో ఏర్పాటు చేయబోతున్నారు.2020 నుంచి 2024 మధ్య దీనిని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ కోసం వివిధ రకాల డిజైన్లను పరిశీలించారు.మంచి నిర్మాణ శైలిని ఎంపిక చేసుకోవాలని, మెట్రోల్ రైల్ కోచ్ ల నుంచి స్టేషన్ల నిర్మాణం వరకు అన్ని కూడా అత్యుత్తమ విధానాలను పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు.  

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X