'ధూమ్' సీరీస్‌లో ప్రభాస్?

ప్రభాస్ కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ బంపర్ ఆఫర్లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. బాలీవుడ్ స్టార్ నిర్మాత ఆదిత్య చోప్రా ధూమ్ సీరీస్‌లోని నాలుగో భాగంలో ప్రభాస్‌ను విలన్‌గా తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.దీనికోసం భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధం అవుతున్నారు.ధూమ్-1లో జాన్ అబ్రహం, ధూమ్-2లో హృతిక్, ధూమ్-3లో అమీర్ ఖాన్‌లు విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. సినిమా మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది. త్వరలోనే ధూమ్-4 సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.మరి ధూమ్-4 లో నటించేందుకు ప్రభాస్ ఒప్పుకుంటారా?లేదా?

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X