చిదంబరంకు బెయిల్

105 రోజుల తర్వాత మాజీ మంత్రి చిదంబరంకు బెయిలు మంజూరు అయింది.ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత చిదంబరం బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది.రూ.2 లక్షల పూచీకత్తుపై ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును కూడా కోరింది.దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది.తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత సాక్షులను ప్రభావితం చేయడంగానీ,ఎవిడెన్స్‌ను నాశనం చేయడానికి గానీ ప్రయత్నించరాదని హెచ్చరించింది. ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి వ్యాఖ్యలనూ చేయరాదని షరతు విధించింది.చిదంబరం బెయిల్ అభ్యర్ధనను వ్యతిరేకిస్తూ,ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మనీలాండరింగ్ వంటి ఆర్థిక నేరాలు వ్యవస్థలో ఘోరంగా పాతుకు పోయి ఉన్నాయని అవి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండా, వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని తగ్గించాయి అని అంచేత చిదంబరంకి బెయిల్ ఇవ్వవద్దని వాదించారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X