ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కులసంఘం దర్యాప్తుకి ఆదేశం

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ గురించి జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తుకు ఆదేశించింది. మానవ హక్కుల సంఘం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసును సుమోటాగా స్వీకరించింది. ఎన్ కౌంటర్ లో నిజనిజాలను తెలుసుకోవటం కొరకు ఒక బృందాన్ని ఘటనాస్థలానికి పంపాలని నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే మానవ హక్కుల సంఘం తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరికాసేపట్లో దర్యాప్తు బృందం హైదరాబాద్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. మానవ హక్కుల సంఘం ఘటనా స్థలాన్ని పరిశీలించిన తరువాత నివేదికను సమర్పించాలని బృందానికి సూచనలు చేసింది. దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన రోజునే నిర్భయ కేసులో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది.నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష ఫైలును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి పంపింది. కేంద్రం వినయ్ శర్మకు క్షమాభిక్షను తిరస్కరించాలని కోరింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అత్యాచారాలకు ఒడిగడుతున్న మానవ మృగాలపై జాలి, దయ చూపించాల్సిన అవసరం లేదని, వారు క్షమాభిక్షకు అనర్హులని ప్రకటించారు. అత్యాచార ఘటనలపై రాష్ట్రపతి కోవింద్ ఈరోజు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ప్రాధాన్యత సంతరించుకుంది.


మహిళా సంఘాలు దిశ హత్య కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని స్వాగతించాయి. మహిళా సంఘాలు ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలను అరికట్టాలంటే కఠిన చట్టాలు రూపొందించాలని కోరుతున్నాయి. అత్యాచార కేసుల్లో నిందితులకు ఎన్ కౌంటర్ జరిగేలా చట్టం తీసుకొనిరావాలని దీన్ని చట్టం చేయాలని మహిళలు కోరుతున్నారు. తప్పు చేసిన వ్యక్తి చట్టానికి భయపడాలని మహిళలు చెబుతున్నారు. సీపీ సజ్జనార్ పోలీసులపై నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని అరిఫ్, చెన్నకేశవులు పోలీసుల దగ్గర నుండి తుపాకులు లాక్కొని కాల్పులకు ప్రయత్నించారని పోలీసులు హెచ్చరించినా నిందితులు వినకపోవడంతో కాల్పులు జరిపారని చెప్పారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X