ఢిల్లీకి వెళ్లిన సీపీ సజ్జనార్‌


దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు.ఆయన స్వయంగా ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది.కాగా.. మంగళవారం సైబరాబాద్‌ పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి మంగళవారం ఓ నివేదికను అందజేశారు. సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ సమయంలో ఏం జరిగిందో అందులో వివరించారని, ఎఫ్‌ఎస్ఎల్ ప్రాథమిక నివేదిక, సీసీటీవీ ఫుటేజీని జతచేసినట్లు సమాచారం. వీటన్నింటినీ క్రోడీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం.. రీ-పోస్టుమార్టాలు, దిశ తల్లిదండ్రులు, సోదరి, నలుగురు నిందితుల తల్లిదండ్రులు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఓ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదికను బుధవారం సుప్రీంకోర్ట్టుకు సమర్పించనుంది.


సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X