తగ్గిన ప్రయాణికులు

ఆర్టీసీ సమ్మె సమయంలో మెట్రోలో ప్రతి రోజూ 4లక్షల మందికి పైగా ప్రయాణం చేశారు.ప్రస్తుతం ఒక్కసారిగా 20-30వేలకు తగ్గిందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలే హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌లో ఎంతో కీలకమైన రాయిదుర్గం మెట్రోస్టేషన్‌ను నవంబర్‌ 29నే ప్రారంభించడంతో మెట్రోలో ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలోనే ప్రయాణం చేస్తున్నారు.ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడుస్తుండగా, కొంత మేర ప్రయాణికుల సంఖ్య తగ్గినా రాయిదుర్గం వరకు మెట్రో మార్గం పొడిగింపు వల్ల రద్దీ కొంత పెరుగుతోందని తెలిపారు. మరో 1-2 నెలల్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య స్థిరంగా ఉంటుందని, అప్పటి వరకు ఎక్కువ, తక్కువగా ఉండే అవకాశం ఉందని మెట్రో అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో బస్సులు అతి తక్కువగా ఉండగా ప్రస్తుతం సిటీ బస్సులు 3వేలకు పైగా తిరుగుతున్నాయి. దీంతో నగరవాసులు ఆయా మార్గాల్లో ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తుండడంతో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మెట్రో కంటే బస్సు చార్జీలు తక్కువగా ఉండడం, బస్సులు అందుబాటులో ఉన్న వారు చాలామంది ఉండడంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిందని మెట్రో అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X