గొల్లపూడి రచనలు తెలుగు భాషా అభివృద్ధికి దిశానిర్దేశం చేశాయి:కేసీఆర్‌

గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి మారుతీరావు చెన్నై లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు తీవ్ర సంతాపం తెలిపారు.గొల్లపూడి మారుతీరావు మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. గొల్లపూడి కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినిమా రంగానికి గొల్లపూడి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. గొల్లపూడి రచనలు తెలుగు భాషా అభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X