టీఆర్ఎస్ పాలనలో వైఫల్యం..ప్రజల పాలిట శాపం:దాసోజు శ్రవణ్

తెలంగాణాలో రెండోసారి కొలువు తీరిన కేసీఆర్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. ఆచరణకు నోచుకోని సంక్షేమ పథకాలతో జనాన్ని బురిడీ కొట్టించిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు. మాయమాటలతో మభ్య పుచ్చుతూ ఫామ్ హౌస్ కే పరిమితమైన చరిత్ర ఈ ఒక్క ముఖ్యమంత్రికే ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అపులకుప్పగా మార్చారని, ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనా పరంగా చూస్తే మొదటి ఏడాది అంతా పూర్తిగా నిరాశ పరిచిందన్నారు. గాంధీ భవన్లో శ్రవణ్ మాట్లాడారు. మాటలు కోటలు దాటాయి చేతలు మాత్రం అడుగు కూడా దాటలేదని ధ్వజమెత్తారు.అన్ని ప్రభుత్వ వ్యవస్థలన్నీ పూర్తి నిర్వీర్యమై పోయాయని మండి పడ్డారు. ప్రథమ ఏడాది పాలన అంతా చెప్పలేనన్ని అబద్దాలు, మాయ మాటలతో గడిచి పోయిందన్నారు. వీటి గురించి చెప్పాలంటే ఓ ఏడాది పడుతుందన్నారు. ప్రజలను నిట్ట నిలువునా ముంచారని ఆరోపించారు శ్రవణ్. సాధారణ, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నా సీఎం స్పందించడం లేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు నోరు మెదపడం లేదని, కనీసం స్పందించక పోవడం బాధాకరమన్నారు.అనైతిక, అప్రజాస్వామిక పద్దతులను అవలంభిస్తూ విపక్షాలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.ఓ ప్లాన్ అంటూ లేకుండా అడ్డగోలుగా నిధులను దుర్నియోగం చేస్తున్న విషయాన్నీ తమ పార్టీ ముందు నుంచీ హెచ్చరిస్తూ వచ్చిందన్నారు. తాము చెబుతున్నది ఇవ్వాళ కళ్ళముందు ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుస్తోందన్నారు. అసలు జనానికి ఏం కావాలో దృష్టి పెట్టకుండా ఎలాంటి ప్రయోజనం లేని పనులకు ప్రాధాన్యత ఇస్తూ పోవడం, నిధులు కేటాయించడం వల్ల ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం పనిచేయడం లేదని, జవాబుదారీగా ఉండడం లేదన్నారు. పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటు అయినప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉండేదని, కానీ దానిని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టి వేశాడని ఆరోపించారు.ఇప్పటి దాకా 3 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకు వచ్చారని, వీటికి వడ్డీలు కట్టడంతోనే సరిపోతోందన్నారు. ఏకంగా రుణాల కోసం ప్రభుత్వ సంస్థలను కూడా తాకట్టు పెట్టిందన్నారు. అంతే కాకుండా ఈ అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆయా రుణ మంజూరు సంస్థలకు పూచీకత్తుగా ఉందన్నారు. మిషన్ భగీరత, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే  పెద్ద మొత్తంలో రుణాలు తీసుకు వచ్చారని ఆరోపించారు. అంచనాలు పెంచి అడ్డగోలుగా ప్రాజెక్టులకు కేటాయించిన చరిత్ర ఈ సీఎం కే ఉందన్నారు. లెక్కకు మించి ఖర్చు చేసినా ఆయా ప్రాజెక్టువల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఒనగూరిందేమీ లేదన్నారు. పైగా రుణభారం జనపై పడిందన్నారు.అన్ని శాఖలు ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని చెబుతున్న ముఖ్యమంత్రి మరి భారీ ఖర్చు పెట్టి ప్రగతి భవన్, కాన్వాయ్ కోసం వాడుతున్న కార్లు ,ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసినప్పుడు ఈ ఆర్థిక క్రమశిక్షణ గుర్తుకు రాలేదా అని శ్రవణ్ ప్రశ్నించారు.

పూర్తిగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను ఇబ్బందులపాలు చేయడం భావ్యం కాదన్నారు. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ కొంపలు కూల్చుతున్న మద్యం ద్వారానే ఈ రాష్ట్రానికి అధికంగా ఆదాయం వస్తోందని, ఇదొక్కటే సీఎం సాధించిన ఘనత అన్నారు. మిగతా రంగాలన్నీ కునారిల్లి పోయాయని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ కొడుతున్న ఈ ఒక్క మద్యం ద్వారా దాదాపు 20,000 కోట్లు ఆదాయం గడించిందన్నారు. ఈ ఒక్క రంగం మీద తప్ప ఈ ప్రభుత్వం ఏ రంగంపై దృష్టి పెట్టలేదన్నారు. 2018 ఎన్నికలలో టిఆర్ఎస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఖాళీలను భర్తీ చేయడానికి లేదా కొత్త గా ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ధ్వజమెత్తారు. గ్రూప్ -1, గ్రూప్ -2 పరీక్షలను ప్రభుత్వం ఒక్కసారి కూడా నిర్వహించలేదని ఆయన అన్నారు.ఏదో గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేయడంలో విఫలం చెందిందన్నారు. 50 శాతం మంది రైతులకు ఇంకా అందలేదన్నారు.  వాగ్దానం చేసిన లక్ష రూపాయల పంట రుణ మాఫీ అమలు కాలేదన్నారు. గతంలో లాభాల్లో ఉన్న కార్పొరేషన్లు ఇప్పుడు దివాళా తీసేందుకు రెడీగా ఉన్నాయనున్నారు.  ఉన్న వాటికే దిక్కులేదు కొత్తగా నిధులు ఎలా కేటాయిస్తారా కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయసు పెంచుతానని చెప్పి ఇప్పటి దాకా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయడంలో విఫలమైందని అన్నారు.బయ్యారం ఉక్కు కార్మాగారాన్ని ఏర్పాటు చేయడం మరిచి పోయిందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడా అగుపించడం లేదన్నారు. చాలా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని, మందులు అందుబాటులో ఉంచడం లేదని ఆవేదన చెందారు.ఉద్యోగుల కార్డులను ఒప్పు కోవడం లేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను క్లియర్ చేయక పోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. మహిళలపై అత్యాచారాలు, నేరాలలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని శ్రవణ్ ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ఆయన ప్రశ్నించారు. గత ఆరేళ్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరూ క్రమబద్ధీకరించ బడలేదని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా మార్చిందని ఆయన ఆరోపించారు .పీజీ టూ కేజీ విద్య మిధ్యగానే మారిందన్నారు. బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగలేదన్నారు. మొత్తం మీద కేసీఆర్ పాలన గాడి తప్పిందన్నారు.కేజీ టూ పీజీ అని ఊదరొగొట్టిన ప్రభుత్వం అమలు చేసేందుకు కావాల్సిన నిధులను బడ్జెట్ లో కేటాయించలేదన్నారు. పనిగట్టుకుని విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రతి ఏడాది విద్యా రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయని చెప్పారు. కేవలం ఈ రంగానికి  6.75 శాతం మాత్రమే కేటాయింపులు జరిపారన్నారు. 2014 - 2015 లో 10 . 88 శాతం వుంటే , 2015 - 2016 లో అది 9 . 69 శాతానికి తగ్గినందన్నారు. ఇక 2016 -2017 లో 8 . 23 శాతం ఉండగా , 2017 - 2018  లో 8 . 49 శాతం ఉండగా 2018 - 2019 బడ్జెట్ వచ్చే సరికల్లా 7 .61 శాతానికి పడి పోయిందన్నారు. ఇక ఈ కేటాయింపుల్లో ఈ ఆర్ధిక సంవత్సరంలో అది 6 .75 కు తగ్గిందన్నారు. విధాయ రంగానికి ప్రభుత్వం చెబుతున్నంతా అబద్దమని తేలి పోయిందన్నారు.ఎడ్యుకేషన్ రంగానికి 16000 వేల కోట్లు ఖర్చు చేశామని స్పీకర్ చెప్పగా, గత సెప్టెంబర్ లో విద్య శాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి 18600 కోట్లు ఖర్చు చేశామని చెప్పారన్నారు. వాస్తవానికి చూస్తే మొత్తం బడ్జెట్  1,46,492  కోటాలో విద్య రంగానికి 9,899.80 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.అక్షరాస్యత పరంగా ఇండియాలో తెలంగాణ వెనుకబడి ఉందని, ఈ విషయాన్నీ 2011 సెన్సెస్ చెప్పిందన్నారు. బడ్జెట్ పరంగా చూస్తే అమలులో దేశంలో 31 వ ర్యాంక్ లో ఉందని ఆర్బీఐ తెలిపిందన్నారు. ప్రజా ఆరోగ్యంలో మిగతా రాష్ట్రాలు మెరుగైన సేవలు , నిధులు జరిపితే మన రాష్ట్రం పట్టించుకోలేదన్నారు. మొత్తం బడ్జెట్ లో కేవలం ఆరోగ్యానికి మన రాష్ట్రం 3.50  శాతం మాత్రమే కేటాయించినందన్నారు. డెంగ్యూ కారణంగా 100 మండి చని పోయారని, ఇంటర్ స్టూడెంట్స్ చనిపోతే సీఎం స్పందించలేదన్నారు. 30 మండి ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించు కోలేదన్నారు. దేశంలో సచివాలయానికి రాణి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే అని అన్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X