క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన పద్మారావు గౌడ్

అన్ని మతాలకు చెందిన్ ప్రార్ధనా మందిరాలను కూడా అబివృద్ది చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని తెలంగాణా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. బౌధనగర్ డివిజన్ లోని బెత్తానీ చర్చి ప్రాంగణంలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ ప్రభుత్వ పరంగా క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అయన మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలోని 10 చర్చీల ద్వారా కనీసం ఐదు వేల మంది క్రైస్తవులకు ప్రభుత్వ కానుకలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఏర్పాట్లు జరుపుతోందని, కానుకలను అందించే ఆర్ధిక స్థితికి పేదలను కూడా చేర్చాలని తాము తపిస్తున్నామని వివరించారు. అన్ని పండుగలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. కార్పొరేటర్ ధనంజన బాయి గౌడ్,  ప్రాజెక్ట్ అధికారి తిరుపతయ్య, అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ కేక్ కట్ చేశారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X