నేను ఆ పదం వాడలేదు: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ వెలుపల మార్షల్స్‌కు, టీడీపీ సభ్యులకు మధ్య జరిగిన ఘటనపై అసెంబ్లీలో పెను దుమారం రేగింది. గురువారం అసెంబ్లీలోకి వస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును మార్షల్స్ అడ్డుకున్నారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు నిలదీశారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అసెంబ్లీలో అధికార పక్షం శుక్రవారం ప్రదర్శించింది. చీఫ్ మార్షల్స్‌ను చంద్రబాబు ‘బాస్టర్డ్’ అని దుర్భాషలాడారని, ప్రతిపక్ష నేత క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. టీడీపీ సభ్యులు చంద్రబాబును అసెంబ్లీ లోపలకి రానీయకుండా అవమానించారని అసెంబ్లీలో నిరసనకు దిగారు.వీడియోలో తన వ్యాఖ్యలపై అసెంబ్లీ సమావేశాల బ్రేక్ సందర్భంలో మీడియాతో ముచ్చటించిన చంద్రబాబు అసలు ఏం జరిగిందో చెప్పారు. ‘బాస్టర్డ్’ అనే పదం తాను వాడలేదని, వాళ్ళు చూపించిన వీడియోలో కూడా ఆ పదం లేదని స్పష్టం చేశారు. ‘జగన్ ఉన్మాది.. అనడానికి ఇదే ఒక గుర్తు’ అని బాబు విమర్శించారు. ఇలాంటివన్నీ ఉన్మాది చర్యలేనని, నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X