సీఎం జగన్‌పై స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్ ఇచ్చిన టీడీపీ

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా సీఎం జగన్ వక్రీకరించారంటూ సీఎంపై ప్రివిలైజ్ నోటీస్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ వెలుపల మార్షల్స్‌కు, టీడీపీ సభ్యులకు మధ్య గురువారం జరిగిన ఘటనపై అసెంబ్లీలో పెను దుమారం రేగింది. అసెంబ్లీలోకి వస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును, టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు నిలదీశారు.అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అసెంబ్లీలో అధికార పక్షం శుక్రవారం ప్రదర్శించింది. చీఫ్ మార్షల్స్‌ను చంద్రబాబు ‘బాస్టర్డ్’ అని దుర్భాషలాడారని సీఎం జగన్ ఆరోపించారు. ‘నో క్వశ్చన్‌’ పదాన్ని బాస్టెడ్‌గా చిత్రీకరించారని చంద్రబాబు చెప్పారు. లేని దాన్ని ఉన్నట్లుగా అసెంబ్లీలో చూపించారని విమర్శించారు. తన నోటి నుంచి ఎప్పుడు బూతులు రావని, ఎప్పుడైనా కోపం వస్తే గట్టిగా మాట్లాడతానని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X