ఆత్మకూరు ప్రజలకు ఉపశమనం

ఘాటెక్కిన ఉల్లి రేటు నుంచి ఆత్మకూరు ప్రజలకు ఉపశమనం

రాయితీ ధరకే ఉల్లి అందించేందుకు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రత్యేక చొరవ

మంత్రి ఆదేశాలతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్డీఓ

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులను ఆదుకునేందుకు కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఉల్లి ధర దేశవ్యాప్తంగా కొనలేక,తినలేని స్థాయిలో ఉన్నా మన రాష్ట్ర ప్రజలకు మాత్రం రైతు బజార్లలో కేవలం రూ.25కే అందిస్తోంది. అదే దారిలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చొరవతో తన సొంత నియోజకవర్గ ప్రజలకు రాయితీ ధరకే ఉల్లిపాయల కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందచేస్తున్న ఉల్లిపాయల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆదేశాలతో ఆత్మకూరు మార్కెట్ యార్డులో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరు ఆర్డీఓ ఉమాదేవి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఉమాదేవి గారు మాట్లాడుతూ సబ్సిడీపై ఉల్లిపాయలు కేజీ రూ.25 రూపాయలకే సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ తమ వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సిబ్బంది , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రూ.100 నుంచి రూ.150 వరకూ పలుకుతున్న ఉల్లిపాయలను వినియోగదారులకు రాయితీ ధరకే అందిస్తోన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X