Suryaa.co.in

Telangana

హైదరాబాద్ లో హైడ్రా, ఆంధ్రలో బోట్లు పేరుతో పాలిటిక్స్

– గురుశిష్యులు ఒకే విధంగా ఉన్నారు
– రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు ఇచ్చి వదిలేశారు
– ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధ రాజ్యమా?
– ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్
– బీఆర్ఎస్ నేతలు జి .దేవీప్రసాద్ ,రాకేష్ కుమార్,ఉపేంద్ర చారి, గోసుల శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: ‘‘ తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్దరిస్తామని కాంగ్రెస్ మాయ మాటలు చెప్పింది. తొమ్మిది నెలలుగా తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంద’’ని మాజీ ఎమ్మెల్సీ జి .దేవీప్రసాద్ అన్నారు.

పోలీసు వ్యవస్థ ద్వారా తీవ్ర నిర్బందం రాష్ట్రంలో కొనసాగుతోంది. పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ఉన్నప్పుడే 90 శాతం
పూర్తి అయింది. మంత్రులు తిరగడానికి హెలికాఫ్టర్లు ఉంటాయి. ఖమ్మంలో వరదలు వస్తే ఒక్క హెలికాప్టర్ ను తెప్పించలేకపోయారు. కాంగ్రెస్ నిర్బందాలపై మేధావులు స్పందించాలి.

ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై ముగ్గురితో కమిటీ వేస్తే వాళ్ళను అనుమతించలేదు. ఖమ్మంలో బిఆర్ఎస్నేతలపై రాళ్ళ దాడి చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై మరో ఎమ్మెల్యే దాడి చేశారు. ప్రశ్నించే వాళ్ళను పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు నిరంతర ప్రక్రియ అంటున్నారు.

ధర్నాలు చేస్తే రైతులపై కేసులు పెడతామని పోలీసులు అంటున్నారు. బి ఆర్ ఎస్ సోషల్ మీడియా వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధ రాజ్యమా? ఆరు గ్యారెంటీలు అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. సీఎం తొమ్మిది నెలల నుండి కలవడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు.ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య చిచ్చుపెట్టే విధంగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.

హైడ్రాపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. హైదరాబాద్ నగరంలో 60 శాతం ప్రజలు నిరాశ్రయులు అవుతారు. హైడ్రాపై కటాఫ్ తేదీ ఏది ఇప్పటివరకు ఎఫ్.టి.ఎల్ మార్క్ లేదు. రాష్ట్రంలో డైవర్షన్పాలిటిక్స్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు ఇచ్చి వదిలేశారు. హైడ్రా పేదలపై ఉక్కుపాదం మోపుతోంది. పౌర హక్కుల సంఘాల నేతలను అరెస్టులు చేస్తున్నారు. బీజేపీ,కాంగ్రెస్ కుమ్మకై రాజకీయాలు చేస్తున్నారు. హామీలు అమలు చేసేవరకు బిఆర్ఎస్ పోరాటం ఆగదు. బిఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరు.

కేసీఆర్ ఆదేశాల మేరకు కే టీ ఆర్ మార్గదర్శకత్వం లో మా బీసీ నేతల బృందం తమిళనాడు పర్యటనకు వెళ్ళింది. మండలి ప్రతిపక్షనేత మధుసూధనా చారి నేతృత్వంలో, తమిళనాడు లో బీసీలకు అందుతున్న ప్రయోజనాలపై అధ్యయనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలి.

కేసీఆర్ హయం లో అమలైన బీసీ ఓవెర్సెస్ స్కాలర్ షిప్ పథకాన్ని కొనసాగించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి. ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి పదిలక్షలకు పెంచినా అది అమలు కావడం లేదు. ఫీజు రియంబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు.

రాష్ట్రంలో మీడియా డైవర్షన్ నడుస్తోంది. హైదరాబాద్ లో హైడ్రా, ఆంధ్రలో బోట్లు పేరుతో పాలిటిక్స్ చేస్తున్నారు. గురు,శిష్యులు ఒకే విధంగా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.

LEAVE A RESPONSE