Suryaa.co.in

Telangana

జర్నలిస్టు శివారెడ్డిపై కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి

– తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిమాండ్

హైద‌రాబాద్‌: ఇటీవల కాలంలో రాష్ట్రంలో మీడియాపై సంస్థలు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు అభిప్రాయపడ్డారు. వార్తలు రాసే, ప్రసారం చేసే జర్నలిస్టులపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టించడం సరైంది కాదని, ప్రసారమైన వార్త పట్ల ఏవైనా సందేహాలు ఉన్న, తప్పుడు వార్తగా భావిస్తే ఖండించాలి తప్ప పోలీస్ కేసులు పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.

ఈ మధ్యకాలంలో అనేక చోట్ల జర్నలిస్టులపై ఈ తరహా కేసులు నమోదవడం పట్ల తెలంగాణ జర్నలిస్టు సమాజం ఆందోళన చెందుతుందని, తాజాగా సీనియర్ జర్నలిస్టు శివారెడ్డి పై ములుగు జిల్లాలో కేసు నమోదు కావడాన్ని టి యు డబ్ల్యూ జే తీవ్రంగా ఖండిస్తున్నది.

సిగ్నల్ టివి జర్నలిస్టు శివారెడ్డి పై ములుగు జిల్లా పస్రా పోలీసు స్టేషన్ లో నమోదైన కేసు ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ (temju ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, ఎ.రమణ కుమార్ లు డిమాండ్ చేశారు.ఇక ముందు కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.

LEAVE A RESPONSE