– పెద్దిరెడ్డి, చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం
– సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించినా అరెస్ట్ లేనట్టే
– విచారణకు సహకరిస్తున్నారని చెప్పిన సిట్
– బిసి యువజన పార్టీ అధినేత రామచంద్రయాదవ్ ఆగ్రహం
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ కాకుండా చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని బిసి యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ధ్వజమెత్తారు. మదనపల్లె ఫైల్స్ తో పాటు లిక్కర్ కేసులోనూ పెద్దిరెడ్డిని, ఆయన తనయుడిని అరెస్ట్ నుంచ రక్షణ కల్పిస్తున్నది చంద్రబాబేనన్నారు.
పెద్దిరెడ్డి అంటే భయమో లేక భక్తో తెలీదుగానీ చంద్రబాబు మాత్రం పెద్దిరెడ్డిని కాపాడుతున్నారన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పినా… సిట్ అధికారులు అరెస్ట్ వారెంట్ కోసం వేసిన పిటిషన్ లో విచారణకు సహకరిస్తున్నాడని చెప్పడం ఏమని అర్థం చేసుకోవాలో తెలీడం లేదన్నారు. చంద్రబాబు, పెద్దిరెడ్డి మధ్య జరిగిన చీకటి ఒప్పందంతోనే పెద్దిరెడ్డి, ఆయన తనయుడు మిధున్ రెడ్డిని చంద్రబాబు కాపాడుతున్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.