– సమాచారం ఇవ్వండి చాలు
– విషం పెట్టి చంపితే కేసు పెడతాం
– ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ సువర్ణ
హైదరాబాద్: పులి కంటే చిరుతపులి తెలివైంది. చిరుత ORR రెండు సార్లు దాటింది. ఇప్పటి వరకు ఎవరిపైనా దాడి చేయలేదు. ఆ తర్వాత అది ఫారెస్ట్ లోకి వెళ్ళింది. నగరంలో చుట్టూ పక్కల అటవీ ప్రాంతం అంతరించింది. అడవిలో సరైన ఆహారం దొరక్కపోతే బయటకి వస్తాయి.
జంతువులు, మానవులపై ఎక్కువ దాడి చేసే అవకాశం ఉంది. ఈ రోజు చిక్కిన చిరుత మగ, 5నుండి 6 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఈ ఒక్క చిరుతకే ఇంత సమయం పట్టింది. రాష్ట్రంలో ఇంకా తిరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మూడు వారాల తర్వాత ఈరోజు మంచిరేవుల లో చిరుత చిక్కింది.
క్రూర మృగాల దాడిలో మనుషులు చనిపోతే పది లక్షల ఎక్స్ గ్రెషియా ప్రకటిస్తున్నాం కానీ విషం పెట్టీ వీటిని చంపొద్దు. చంపితే అటవీ చట్టం కేసులు నమోదు అవుతాయి. టోల్ ఫ్రీ 040 23231772 కి కాల్ చేసి మాకు సమాచారం ఇవ్వండి.
పులుల సంతానం పెరగలేదు: ఫారెస్ట్ సీనియర్ ఆఫీసర్ శంకరన్
చిరుత పులుల సంచారం పెరుగుతుంది. పులుల సంతానం పెరగలేదు.
మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వస్తున్నాయి. మహబూబ్ నగర్ లో రెండు చోట్ల చిరుత పులులు సంచరిస్తూన్నాయి. మనుషుల మీద దాడులు చేస్తున్నాయి.
చిలుకూరు ప్రాంతంలో ఉన్న చిరుతను పట్టుకున్నాం. గతంలో ఒక చిరుతను పట్టుకోవాలాంటే మూడు నెలలు పట్టింది చిలుకూరు లో.
ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయసంగా చిరుతను పట్టుకున్నం. వాకర్స్ కూడా సహకరించారు.