గాడిచర్ల సర్వోత్తమరావు ..
తెల్లోళ్ళ ఏలు”బడి”లో
తరగతి గదిలో
వందేమాతరం..
అదెవరి తరం..
బిపిన్ చంద్ర ప్రసంగాలతో
రగిలిన స్ఫూర్తి
దారితీసింది
కళాశాల బహిష్కరణకు..
లేతప్రాయంలోనే స్వరాజ్య
సమరాంగణమునకు..!
క్లాస్ రూములో వందేమాతరం
బ్యాడ్జి ధరించిన దేశభక్తికి
పరాయి పాలకులిచ్చిన
నజరానా..
సర్కారీ కొలువులకు అనర్హత..
నాకే వద్దులే ఉద్యోగమన్న
భారతీయ పౌరుషం
పట్టింది పెన్ను..
తెల్లోడి అక్రమాలపై
పేలిన గన్ను..!
పోలీసు కాల్పుల్లో
ముగ్గురు మరణిస్తే
మరిగిపోయిన
సర్వోత్తమరావు కలం
బ్రిటిష్ రూలుకు నిరసనగా
విదిలించింది జూలు..
క్రూరమైన విదేశీ పులి
సంపాదకీయం
పంపింది జైలుకు..
ఆంద్రులలో
తొలి రాజకీయ
ఖైదీ హోదా..
జాతి మొత్తం గాడిచర్ల
తెగువకు అయింది ఫిదా!
నెల్లూరు చెరసాలలో
బందిపోట్ల నడుమ ఆటుపోట్లు..
పెరిగింది తెగువ..
తిలక్ పిలుపుతో
హోం రూల్ ఉద్యమం..
హిందుస్తానీ సేవాదళ్
నాయకత్వం..
పెంచింది మరింతగా
పోరాడే తత్వం..!
పత్రికను నడిపే సారధి
ఎడిటర్ కాదు
సంపాదకుడని పేరు..
అదే సర్వోత్తమరావు తీరు!
బాపూనే విమర్శించి
అదే బాపూ నుంచి
ది బ్రేవో సర్వోత్తమరావు
అని ప్రశంసలు
అందుకున్న ధీశాలి..
కాళోజీనే మెప్పించి..
వందేమాతరమనగనే
వచ్చి తీరునెవని పేరు..?
వయోజన విద్య అనగనే
వచ్చి తీరునెవని పేరు?
గ్రామగ్రామమున వెలసెడి
గ్రంధాలయమెవనికి గుడి
అరగని తరగని వొడవని
అక్షరదానంబెవడిది..?
ఏ స్థాన కవినో నేను
ఆస్థానాధీశుడెవడు?
హరి సర్వోత్తముడాతడు
ఆంధ్రుల పాలిటి దేవుడు!
ఇది చాలదా గాడిచర్ల
ఘనతకు గురుతు..
వెరపు లేని ధైర్యమే షరతు!!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286