Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పేటీఎం కుక్కల అరుపులకు, ఉడతఊపులకు భయపడేవాడిని కాదు

– వివేకాహత్యోదంతాన్ని, భూమానాగిరెడ్డి, కోడెలశివప్రసాదరావు మరణాలను – చంద్రబాబుకి ఆపాదించి, రాక్షసానందం పొందినప్పుడు వైసీపీవారికి, జగన్మోహన్ రెడ్డికి మంచి, మానవత్వం గుర్తురాలేదా?
• గౌతమ్ రెడ్డి మరణంపై తానుఎలాంటి దుష్ప్రచారం చేయలేదు. కేవలం ప్రసారమాధ్యమాల్లో వచ్చిన అంశాలనే మీడియావారితో ప్రస్తావించాను.
• నా వ్యాఖ్యలునిజంగా గౌతమ్ రెడ్డి గారి కుటుంబాన్ని బాధించిఉంటే, వారికి క్షమాపణ చెబుతున్నాను.
• కానీ సజ్జల నిర్దేశకత్వంలో, పీకే మార్గదర్శకత్వంలో పావలాకు,అర్థరూపాయికి కక్కుర్తిపడుతూ, నీతిమాలిన ప్రచారంచేస్తున్న వైసీపీపేటీఎంకుక్కలను మాత్రం వదిలపెట్టేదిలేదు
– మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి

కేబినెట్ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తమనుఎంత గానో కలచివేసిందని, వారిపైనా, వారికుటుంబంపైనా తమకు ఎంతో గౌరవముందని, మాపార్టీఅధినేత చంద్రబాబు కూడా గౌతమ్ రెడ్డి మరణించారని తెలియగానే చాలాబాధపడ్డారని, సౌమ్యుడు,వివాదరహితుడు అయిన గౌతమ్ రెడ్డి మృతిగురించి తానేదో చెడుగా ప్రచారంచేసినట్లు కొన్నిప్రసారమాథ్యమాల్లో వచ్చిం దని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు.గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయం లోవిలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

గౌతమ్ రెడ్డి మరణించని వెంటనే వివిధసామాజిక మాధ్య మాల్లో వచ్చిన అంశాలనే తానుప్రస్తావించానుగానీ, వైసీపవారిలా శవరాజకీయాలుచేయాలన్న దురుద్దేశంతో కాదు. తాను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందోకూడా వైసీపీవారు ఆలోచిస్తే మంచిది. గతంలో టీడీపీప్రభుత్వంఉన్నప్పుడు, భూమానాగిరెడ్డి గారు టీడీపీ లో చేరిన కొద్దిరోజులకే దుర్మరణం పాలయ్యారు. అప్పుడు వైసీపీలో ఉన్న పార్థసారథి, బొత్ససత్యనారాయణ, భరత్ లాంటివారు, మరికొందరువ్యక్తులు సిగ్గులేకుండా దారుణంగా మాట్లాడారు. భూమానాగిరెడ్డి సంతాపసభలో నీతిమాలిన రాజకీయాలు చేసింది ఆనాడు వీరుకాదా? ఆనాడు సంతాపసభతో ఆగకుండా అప్పుడుప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరీదారుణంగా మాట్లాడాడు. శాసనసభ్యుడిగాఉన్న భూమానాగిరెడ్డి చనిపోతే, అతని సంతాపసభకు హాజరుకాకుండా, భూమా మంచోడుకాదని, అందుకే తాను సభకు హాజరుకాలేదని సిగ్గులేకుండా మాట్లాడాడు. ఆనాడు భూమానాగిరెడ్డి గురించి అలా మాట్లాడటం వైసీపీవాళ్లు చేయొచ్చా?

వారు గతంలో మాట్లా డితే అది ఒప్పా..ఇప్పుడు గౌతమ్ రెడ్డి మరణంపై ప్రసారమాధ్య మాల్లో వచ్చిన కథనాలను ఉటంకిస్తే అది మాతప్పా? భూమా నాగిరెడ్డిని టీడీపీవారే చంపారనికూడా గతంలో వైసీపీవారు పేట్రేగి మాట్లాడారు. వారిలానే తానుఇప్పుడు గౌతమ్ రెడ్డిని ప్రభుత్వమే చంపించిందని తాము అనలేదు. భూమా మరణించినప్పుడు అలా మాట్లాడిన నీతిమాలినవాళ్లే, తిరిగి స్పీకర్ గా పనిచేసి కోడె ల శివప్రసాదరావు చనిపోతే, ఆయనమరణానికి బాబే బాధ్యుడం టూ బరితెగించి మాట్లాడారు. ప్రభుత్వ చీఫ్ విప్ స్థానంలో ఉన్న వ్యక్తే బరితెగించి మాట్లాడటం సిగ్గుమాలినతనం కాదా? కోడెల మరణానికి చంద్రబాబేకారణమని కొడాలినానీతో మాట్లాడించారు. దానిపై ఏంసమాధానం చెబుతారో చెప్పండి?

తానేదో గౌతమ్ రెడ్డి మరణంపై చెడుగా మాట్లాడానని వైసీపీ పేటీఎం బ్యాచ్ నన్నుదూషిస్తూ, అనరాని మాటలంటూ దుష్ప్రచా రం చేస్తున్నారు. చిన్నవయసులోనే ప్రజలకోసం జైలుకువెళ్లిన వాడిని. ఇలాంటి పేటీఎం కుక్కలఅరుపులకు భయపడను.ఆ అంశాలు పక్కనపెడితే, సొంత చిన్నాన్నమరణంపై ముఖ్య మంత్రి ఎందుకు స్పందించడు? వివేకానందరెడ్డి హత్యగావింపబడి తే ఆ దారుణాన్ని చంద్రబాబుకి అంటగట్టి, రాజకీయలబ్ధి పొందా లని చూసింది జగన్ రెడ్డికాదా? మీసాక్షిపత్రికలో నారాసురరక్త చరిత్ర అంటూ సిగ్గలేనిరాతలు రాయించినప్పుడు మేమెంత బాధ పడిఉంటామో మీరెందుకు ఆలోచించలేదు? బాబాయ్ ని చంపించి రక్తపుమరకలు తుడిపేయించిందిఎవరు? వివేకాహత్యను ఎన్నికల్లో గెలుపుకోసం వాడుకొని లబ్ధిపొందింది మీరుకాదా?

పీకే మార్గదర్శకత్వంలో చంద్రబాబుపైనా, టీడీపీపైనా విషప్రచారంచేసి, లబ్ధిపొందింది మీరుకాదా? చంద్రబాబు హత్యలుచేయిస్తారా? రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ గా పేరుపొందిన వ్యక్తి, ఏనాడూ ఎవరినీ తొందరపడి పల్లెత్తుమాట అనని వ్యక్తి, రాయలసీమలో ఫ్యాక్షన్ తగాదాలకు చెక్ పెట్టి, ఆప్రాంతాన్నిసస్య శ్యామలం చేయడానికి కృషిచేసిన చంద్రబాబుకి భూమా మర ణాన్ని, కోడెలమృతిని అంటగట్టింది మీరుకాదా? మీ సొంత చిన్నాన్నను మీరేచంపి, ఆ దారుణాన్ని చంద్రబాబుగారికి అంట గట్టించాలని చూసినా, తాము ఏనాడూ జగన్మోహన్ రెడ్డిని, ఏమీఅనలేదు. ఎందుకుంటే కుటుంబ సభ్యుడిని కోల్పోయి ఉన్నారు.. ఆ బాధలో ఏదో అంటారులే అని సరిపెట్టుకున్నాము. కానీ మీరుచేస్తున్నది చూస్తుంటే ఇక ఊరుకోకూడదని నిర్ణయించుకునే నేను నేడుమీడియాముందుకు వచ్చాను.

పావలాకు, అర్థరూపాయికి కక్కుర్తిపడే వైసీపీ పేటీఎం కుక్కలతో నాకుఫోన్లు చేయించి, సజ్జల లాంటివాళ్లు ఏదోసాధి ద్దామని చూస్తున్నారు. ఏమీచేయలేరని గుర్తుంచుకోండి. నలభై ఏళ్ల రాజకీయజీవితంనాది. నేను ఏం మాట్లాడినా ఆచితూచే మాట్లాడతాను. గౌతమ్ రెడ్డి మరణం పై తాను ఏదైనా తప్పుగా మాట్లాడానని గౌతమ్ రెడ్డి తల్లిగారు, సతీమణి భావిస్తే, వారికి నిజంగా క్షమాపణలు చెబుతున్నా. శవరాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి, అతని పరి వారమే దిట్టని చెప్పడానికే తాను మాట్లాడానుతప్ప, గౌతమ్ రెడ్డి ని, వారి కుటుంబసభ్యులను కించపరచాలని కాదు. దయచేసి గమనించాలనికోరుతున్నాం.

ఏవ్యక్తైనా సరే నైతిక విలువలకు కట్టుబడిఉండాలి. వివేకాహత్యను చంద్రబాబుకి అంటగట్టి దుర్మార్గపుప్రచారం చేసినప్పుడు ఆయనెంత మానసికక్షోభకు గురైఉంటారో ఆలోచించండి. ఆయనేమీ మీకులాగా ఫ్యాక్షనిస్టో, ఆర్థికనేరగాడో, అవినీతిపరుడోకాదు. మీకులాగా రక్తపు మడుగులోచేతులుకడుక్కునే వ్యక్తికాదు. అలాంటి వ్యక్తిని మొన్న టికి మొన్న నిండుశాసనసభలో ఏడిపించారు.

మీరుచేస్తే సంసార మా..మేంఏదైనా అంటే వ్యభిచారమా? నీతిమాలిన మీలాంటి పేటీ ఎం కుక్కలుఎంతమొరిగినా, నాకుఫోన్లుచేసి బెదిరించినా నన్నే మీ చేయలేరని గుర్తుంచుకోండి. బాబాయ్ ని ఎవరు చంపారో పేటీ ఎంబ్యాచ్ కు, ఆనాడు సాక్షి లో పనిచేస్తున్న సజ్జలకు తెలియదా? మరెందుకు ఆహత్యను చంద్రబాబుకి ఆపాదించారు. అంతకంటే దుర్మార్గం మరోటి ఉంటుందా? మీరుచేసినదానితో పోలిస్తే, మేం అన్నది ఆవగింజంతకూడా తప్పుకాదు.

భవిష్యత్ లో అయినా శవరాజకీయాలుచేయకుండా, నీతిమాలిన పనుల్ని రాజకీయాల కు వాడుకోకుండా ఉంటారని ఆశిస్తున్నాం. జాగ్రత్తగా ఇకనుంచైనా పేటీఎం బ్యాచ్, సజ్జల, పీకే.టీం ఒళ్లుదగ్గరపెట్టుకొనిప్రవర్తిస్తే మంచి దనిహెచ్చరిస్తున్నాం. నేను క్షమాపణలుచెప్పింది గౌతమ్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే, వైసీపీకుక్కలకు, పేటీఎం బ్యాచ్ కు కాదు. ఇకపై పరివర్తనలేకుండా పిచ్చిపిచ్చిగా ప్రచారంచేసినా, తమపై విషప్రచారంచేసినా, మా చంద్రబాబు ,లోకేశ్ పై తప్పుడుప్రచారంచేసినా మీకు ఇంతకు నాలుగింత లు ఎక్కువగా సమాధానంచెబుతామని హెచ్చరిస్తున్నాం.

కేంద్ర ప్రభుత్వం వారు సాక్షిదినపత్రికకు తోకకోసి కారంపెట్టారు. తప్పుడు ప్రచారం చేస్తున్నందుకే అలాచేశారని గుర్తుంచుకోండి. నన్ను బెదిరించడానికి దేశ, విదేశాలనుంచి సుమారు వెయ్యిమంది ఫోన్లుచేశారు. ఛండాలంగా దుర్భాషలాడుతూ మెసేజ్ లు పంపా రు. వాటన్నింటిపై తాను పోలీసులకు ఫిర్యాదుచేయబోతున్నా ను. ఏపీలో ప్రశాంత్ కిషోర్ ఆటలుసాగవనే విషయాన్ని అతను తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నాం.

LEAVE A RESPONSE