రెండేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజ్ (52) తండ్రయ్యారు. ఆయన భార్య తేజస్విని ఈ ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
దిల్‌రాజు , తేజస్వినిల వివాహం డిసెంబర్ 10, 2020లో జరిగింది. నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో పరిమిత సంఖ్యలోని అతిథులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగిన సంగతి విదితమే. దిల్‌రాజుకిది రెండో వివాహం. ఆయన మొదటి భార్య అనిత.. 2017లో గుండెపోటుతో కాలం చేశారు. దిల్‌రాజు, అనితలకు ఓ కుమార్తె ఉంది. ఆమె హన్షిత. ప్రస్తుతం ఆమె దిల్ రాజు రూపొందిస్తోన్న కొన్ని సినిమాల నిర్మాణ పనులను వ్యవహరిస్తూనే తెలుగు డిజిటల్ మాధమ్యం ఆహాలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
ఇక దిల్‌రాజు ఇప్పుడు తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నారు. కోలీవుడ్ హీరో దళపతి విజయ్‌తో వారసుడు (తమిళంలో వారిసు) (Vaarasudu) అనే సినిమాను చేస్తోన్న సమయంలోనే ఆయనింటికి నిజమైన వారసుడు వచ్చాడు. మరో వైపు చరణ్, శంకర్ కాంబినేషన్‌లో దిల్‌రాజు, శిరీష్ కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
Producer Dil Raju was blessed with a baby boy early in the morning today.
— Vamsi Kaka (@vamsikaka) June 29, 2022