ఢిల్లీపై సుప్రీం సీరియస్

దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో పంజాబ్‌,హరియానా ప్రభుత్వాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.పశువుల ప్రాణాలు పోతే పట్టించుకునే ప్రభుత్వాలకు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నించింది. ప్రజల గురించి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారంలో ఉండే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఈ ఏడాది కూడా పంట వ్యర్థాలను తగలబెడతారని అందరికీ తెలిసినా ప్రభుత్వాలు ఎందుకు ముందస్తు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించింది. పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు నివారించలేదని నిలదీసింది. రైతుల నుంచి పంట వ్యర్థాలను సేకరించడమో, కొనుగోలు చేయడమో ఎందుకు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు.ఈ విషయంలో పంజాబ్‌, హరియానా ప్రభుత్వాలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించింది.అధికారులను శిక్షించే సమయం వచ్చిందని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం రెండు రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నించింది. ఢిల్లీలో పొల్యూషన్‌తో జనం చస్తుంటే మీ పనిపట్ల మీరు గర్వంగా ఫీలవుతున్నారా అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.  

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X