మీరు తేల్చకపోతే మేమే నిర్ణయిస్తాం:హైకోర్టు

ఆర్టీసీ సమ్మెపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఈనెల 11వ తేదీలోపు కార్మికులతో చర్చలు జరిపి..సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే...కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయన్న విషయాన్ని విస్మరించొద్దని పేర్కొంది. 11వ తేదీలోపల సమస్య పరిష్కరించక పోతే...తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. తదుపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది.వాదనల సందర్భంగా .. ప్రభుత్వ అధికారులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం తప్పుబట్టింది.ఐఏఎస్‌ అధికారులే హైకోర్టుకు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా? అని ప్రశ్నించింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. శుక్రవారం (రేపు) దానిపై విచారణ జరపనుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X