మీ అసమర్థతవల్ల కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారు:నారాలోకేష్

భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై టిడిపి శవరాజకీయాలు చేస్తుందని జగన్ అనడం...వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టే ఉంది.శవరాజకీయాలకు  జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం మర్చిపోయినట్టు ఉన్నారు. ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మాట్లాడటం ఇప్పటికైనా మానండి.జగన్ కి చేతనైతే వైకాపా నేతల ఇసుక అక్రమరవాణా అడ్డుకొని, సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తేవాలి. మీ అసమర్థతవల్ల కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారు. కాకినాడలో వీరబాబు కుటుంబాన్ని పరామర్శించి వచ్చేలోపే మరో ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు మాని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X