మీర్‌పేట్‌లో పేలుడు

హైదరాబాద్‌లో పేలుడు కలకలం సృష్టించింది. మీర్‌పేట్‌లోని విజయపురికాలనీలో ఈ పేలుడు సంభవించింది. చెత్తకుప్పలో ఉన్న  ఓ డబ్బా ఒక్కసారిగా పేలింది.చెత్త ఏరుకుంటున్న మహిళ  తీవ్రగాయాలపాలైంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మీర్‌పేట్ పోలీసులు డబ్బాను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X