మళ్ళీ నోటు రద్దా?

మూడేళ్ళ క్రితం పెద్ద నోట్లు రద్దు జరిగింది.ఈ నోట్ల రద్దుతో దేశంలో ఆర్ధిక వ్యవస్థ కొంతమేర కుంగిపోయింది.  దీని నుంచి దేశంలో త్వరగానే కోలుకుంది.పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే ప్రభుత్వం వంద, ఐదు వందలు, రెండువేల రూపాయల నోటును రిలీజ్ చేసింది. 2000 నోటు బాగా విపణిలోకి వచ్చింది.  ప్రస్తుతం ఈ నోటు ముద్రణను ఆర్బిఐ నిలిపివేసిన సంగతి తెలిసిందే.  అయితే, 2000 రూపాయల నోట్లను ఎక్కువ మొత్తంలో విపణిలోకి రిలీజ్ చేసినా...అవి ఇప్పుడు బయట పెద్దగా కనిపించడంలేదు.2000 రూపాయల నోటును దాచిపెడుతున్నారని,వాటిని రద్దు చేస్తే అన్ని నోట్లు బయటకు వస్తాయని ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి పేర్కొన్నారు.  రెండువేల రూపాయల నోటును రద్దు చేసి వాటిని బ్యాంకులకు ఇవ్వలని, వాటి స్థానంలో కొత్త నగదు కాకుండా డిజిటల్ రూపంలో నగదు బదిలీ చేయాలనీ అయన అంటున్నాడు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X