2020 నుంచి ఉచితంగా నెఫ్ట్‌ సేవలు

సేవింగ్‌  బ్యాంకు ఖాతాదారులకు  రిజర్వ్‌బ్యాంకు  ఆఫ్‌ ఇండియా  శుభవార్త చెప్పింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్‌ (నెఫ్ట్‌)  సేవలు  2020 జనవరి నుంచి ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను విధించబోమని ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం మేరకు బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని ఆర్‌బీఐ కోరింది. సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, సురక్షితమైన, సురక్షితమైన పేమెంట్ వ్యవస్థలను స్థాపించడం ఆర్‌బీఐ లక్ష్యమని, ఈ ప్రయత్నాల ఫలితంగా రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందాయని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X