తాత్కాలికంగా బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ మూసివేత

మంత్రి కేటీఆర్ చేతుల మీదగా నవంబర్ 3న ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌‌ను తాత్కాలికంగా మూసివేశారు.ఫ్లైఓవర్‌పై మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ ముందు వెళ్తున్న ద్విచక్రవాహనదారులను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు యువకులకు తీవ్రమైన గాయాలయ్యాయి.దీంతో ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

అసలు ఏం జరిగిందంటే

రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం...కూకట్‌పల్లి శాంతినగర్‌లో నివసిస్తున్న పి.అభిలాష్‌(28) కాగ్నిజెంట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు.స్నేహితులతో కలిసి మద్యం తాగి శనివారం అర్ధరాత్రి ఐ20 కారులో రాయదుర్గం నుంచి మాదాపూర్‌ వెళ్తున్నాడు.బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌పై అదుపు తప్పి ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు. బైక్‌పై వెళ్తున్న ఎన్‌. సాయివంశీ రాజు(22),వి.ప్రవీణ్‌కుమార్‌(22)ఫ్లై ఓవర్‌ పై నుంచి నిస్సాన్‌ షోరూమ్‌ ముందు పడిపోయారు.తీవ్రమైన గాయాలవడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.సాయివంశీరాజు వరంగల్‌కు చెందిన వాడు. సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు.ప్రవీణ్‌కుమార్‌ది మహబూబ్‌నగర్‌ జిల్లా. నగరంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.వీరితోపాటు మరో రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న సాయికృష్ణ(21),పవన్‌కుమార్‌(19), పడాల మరళీకృష్ణ,గిరిధర్‌ సుభాష్‌(26) గాయపడ్డారు.సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సాయివంశీ రాజు, ప్రవీణ్‌కుమార్‌ మృతదేహాలను, గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 


సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X