సమ్మెపై విచారణను 18కి వాయిదా

ఆర్టీసీలో ప్రైవేట్‌ బస్సుల పర్మిట్‌పై స్టే కొనసాగుతోంది. గురువారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులోఈ రోజు విచారణ జరిగింది.ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 18కి హైకోర్టు వాయిదా వేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి... కమిటీ వేయాలని పిటిషనర్ తరపు లాయర్‌ రాపోలు భాస్కర్ కోర్టును కోరారు.సమస్యను తొందరగా పరిష్కరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని, ఇప్పటి వరకు 27 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, హైపవర్ కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలని రాపోలు కోరారు.ఆర్టీసీ సమ్మెపై హైపవర్‌ కమిటీకి ప్రభుత్వం ఒప్పుకోలేదని ఏజీ చెప్పారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని ఏజీ వాదించారు. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని ఎలా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఈ సందర్భంగా ఏజీ ప్రస్తావించారు. ఎస్మాపై 2015లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్9ను ప్రస్తావించారు.ఆరునెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు జీవో పొడిగిస్తారని ఏజీ పేర్కొన్నారు.1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన జీవో నెం.180ని కూడా ఏజీ ప్రస్తావించారు. 1988లో తీసుకొచ్చిన జీవో 180 తెలంగాణకు వర్తించదని హైకోర్టు తెలిపింది.పునర్విభజన చట్టం సెక్షన్ 68 ప్రకారం పబ్లిక్ యుటిలిటీ సర్వీసులు ఎస్మా పరిధిలోకి వస్తాయని ఏజీ వాదనలు వినిపించారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X