ఇసుకలో వేలకోట్లు దండుకున్న చంద్రబాబే దీక్ష చేయడం విడ్డూరంగా ఉంది

చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఎద్దేవా చేశారు. కేవలం వాళ్ల ఉనికి కాపాడుకోవడం కోసమే ఆయన తన కుమారుడితో కలిసి పనికిమాలిన దీక్షను చేపట్టారని ఆరోపించారు. ఇసుకలో వేలకోట్లు దండుకున్న చంద్రబాబే ఇప్పుడు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు.వెయిట్‌ లాస్‌ కోసమే చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్నారని, ఆయనకు డేరా బాబాకు ఏం తేడా లేదని పార్థసారథి మండిపడ్డారు. ఆయన గురువారం పార్టీ ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్‌, కైలే అనిల్‌ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. వరదలతో ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవమే అయినా రాష్ట్రంలో ప్రసుత్తం లక్షా 50 వేల టన్నుల సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల భరోసా కోసమే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇసుక వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసిన బ్లూ ప్రాగ్‌ సంస్థ యజమాని, చంద్రబాబు సన్నిహితులని వారిద్దరు కలిసి ఒకే ఛాపర్‌లో తిరిగేవారని ఆరోపించారు.ఐటీ గ్రిడ్‌, బ్లూ ఫ్రాగ్‌ సంస్థలు చంద్రబాబుకు పిల్ల కాలువలుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, అందుకే ఇలాంటి దొంగ దీక్షలు చేస్తున్నారని అన్నారు. బాబు విడుదల చేసింది దొంగ చార్జీషీట్‌ అని...దమ్ముంటే ఇసుక ఆరోపణలపై ఆధారాలు చూపించాలని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X