వెంటిలేటర్‌పై లోకో పైలెట్‌

కాచిగూడ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లోకో పైలెట్‌ చంద్రశేఖర్‌ ఆరోగ్యం విషమంగా ఉంది.అతని కుడికాలుని వైద్యులు పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం చంద్రశేఖర్‌ని ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈ ఘటనలో చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిద్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్‌ఫెక్షన్‌ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కుడి మోకాలి పైభాగం వరకు కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ఇప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. రెండు రైళ్ల మధ్య నలిగి లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు సుమారు 8 గంటల పాటు శ్రమించి అతన్ని అతి కష్టం మీద బయటకు తీశారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X