ఏలూరు : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో ఓ బాలుడు నీటితొట్టెలో పడి మృతి చెందిన విషాద సంఘటన జరిగింది. ఈ ఘటన మండలంలోని దొరసానిపాడులో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి గ్రామానికి చెందిన తానిగడప భాష. లత దంపతులకు జాన్ భూషణ్( 4) ఇంట్లో ఎవరిపనిలో వారుండగా చిన్నారి బాలుడు ఆడుకుంటూ తొట్టె లోకి జారాడు. ఆతరువాత నీట మునిగి ఊపిరాడక మృతి చెందాడు. పిల్లాడు కనిపించకపోయేసరికి పరిసరాలు వెదుకుతున్న తల్లితండ్రులకు తొట్టెలో తేలి ఉన్న బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడ్ని స్థానిక పిహెచ్సికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Devotional
రావి చెట్టు – వేప చెట్టును కలిపి ఎందుకు పూజిస్తారు?
మన పురాణాలు, సంస్కృతి, సంప్రదాయాలన్నీ ప్రకృతి ప్రాధాన్యతను ప్రతిఫలించేలా ఉండటం విశేషం. వాటిలో ముఖ్యంగా రెండు చెట్లు – రావి చెట్టు ( మరియు వేప చెట్టు – భారతీయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవి. వీటిని కలిపి పూజించడం ఒక ప్రాచీన ఆచారం మాత్రమే కాదు, గొప్ప ఆధ్యాత్మికత, వైజ్ఞానికత మరియు ఆరోగ్య రహస్యాలను కూడా…
ఈశ్వరుడి లీలా అపారమైనది
మనిషి శరీరంలోని వేళ్లపై ఉన్న చర్మం మీద రేఖలు రూపుదిద్దుకోవడం, శిశువు తల్లిగర్భంలో సుమారు నాలుగు నెలల వయసు ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఈ రేఖలు మాంసంపై జాలంలా…అంటే వలయంలా ఏర్పడతాయి. ఈ రేఖల ఏర్పాటుకు సమాచారం డిఎన్ఎ ద్వారా లభిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రేఖలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…