Suryaa.co.in

Andhra Pradesh

కోట్లాదిమంది ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్

-కేంద్ర వార్షిక బడ్జెట్ పై ఎంపీ పురందేశ్వరి స్పందన

రాజమహేంద్రవరం : ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర వార్షిక బడ్జెట్ కోట్లాది మంది భారతీయ పౌరుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు,ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఈరోజు పార్లమెంట్ లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆమె స్పందించారు.

ఆర్థిక వృద్ధిని, దేశ అభివృద్ధిని ప్రోత్సహించే బడ్జెట్ అని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా భారతదేశ వృద్ధిలో కీలకంగా వ్యవహరించే మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా బడ్జెట్ ఉందని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. అలాగే వ్యవసాయం, ఎంఎస్ ఎం ఈ లు, మహిళలు, యువత ఇలా అన్ని రంగాలను దృష్టి పెట్టుకుని, అన్నింటా వృద్ధిని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE