జగ్గయ్యపేట : సీనియర్ జర్నలిస్ట్ ఎం సైదేశ్వరావుపై చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసులో అక్రమ అరెస్టుపై హైకోర్టులో దిక్కరణ కింద కేసు నమోదైంది. ఈ విషయమై చిల్లకల్లు సబ్ ఇన్స్పెక్టర్, జగ్గయ్యపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కోర్టుదిక్కరణ కేసును ఎమ్.సైదేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది.
సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి, 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయాలనే ఉద్దేశంతో కేసుకు సంబంధం లేని సెక్షన్లను ఉపయోగించి అక్రమంగా అరెస్టు చేసినందున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో కోర్టు ధిక్కరణ కేసును అందుకు బాధ్యులైన జగ్గయ్యపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్. చిల్లకల్లు సబ్ ఇన్స్పెక్టర్ ల పై తగు చర్యలు కోరుతూ కేసు నమోదు చేయడం జరిగింది.