Suryaa.co.in

Andhra Pradesh

ఒక్కరోజు వేతనం రూ.120 కోట్లకు పైగా విరాళం

– ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు

విజయవాడ: వరద బాధితులకు ఒక్కరోజు వేతనం ఇచ్చి అండగా నిలిచిన ఏపీజేసి అమరావతి. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, కోశాధికారి కనపర్తి సంగీతరావు తో పాటు వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆ వివరాలివి. సుమారు పది లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఒక్క రోజు వేతనం రూ.120 కోట్లు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు.

2022లో ఉద్యోగులు ‘చలో విజయవాడ’ ఉద్యమం చేసినప్పుడు విజయవాడ ప్రజలు ఉద్యోగులకు అండగా నిలిచారని, లక్షలాదిగా బీఆర్‌టీఎస్‌ రోడ్డుపైకి తరలి వచ్చిన ఉద్యోగులకు మంచినీరు, మజ్జిగా సరఫరా చేసి, మాకు అండగా నిలిచిన క్షణాలు మాకు ఇంకా గుర్తు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే ఈ పరిస్థితుల్లో ఆదుకునేందుకు, ప్రభుత్వం చేస్తున్న సహాయ, పునరావాస కార్యక్రమాల కృషిలో కొంతమేరకైనా ఉద్యోగులుగా ఆర్థిక సహాయం అందించాలని సంకల్పించాం.

“ఏపీ జేఏసీ అమరావతి” లో భాగస్వామ్యంగా ఉన్న సుమారు 90 డిపార్ట్మెంట్ సంఘాలకు సంబంధించి ఉద్యోగులందరి పక్షాన ఒక్కరోజు వేతనంలో “బేసిక్ పే” ను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసేందుకు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వయంగా లేఖ అందజేసినట్టు తెలిపారు.

LEAVE A RESPONSE