జగన్ రెడ్డిని కాపాడటానికే మహిళా కమీషన్ చైర్ పర్సన్ లేఖ

– ట్విట్టర్ లో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత..

వాసిరెడ్డి పద్మ గతంలో అకారణంగా చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇచ్చి మహిళా కమీషన్ ముందు హాజరు కావాలి అన్నారు. ఇప్పుడు తమ పార్టీ ఎంపీ అడ్డంగా దొరికిపోయి రాష్ట్రంలో మహిళలంతా చీ కొడుతుంటే తీరిగ్గా రెండు రోజుల తర్వాత లేఖ రాశారు అట.. ఇది ఖచ్చితంగా చిత్తశుద్ధితో చేసిన చర్య మాత్రం కాదు. జగన్ రెడ్డి ని కాపాడటానికి రాసిన లేఖ ఇది. రెండ్రోజులయినా ఇంకా పార్టీ నుండి ఎందుకు బహిష్కరించలేదు అని మహిళలు జగన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉండటంతో విచారణ కొరకు లేఖ పేరుతో కాలయాపన చేయడానికి వేసిన ఎత్తుగడ ఇది. రాష్ట్ర ప్రతిపక్ష నేత ను నాకున్న సర్వాధికారాలతో కమీషన్ ముందు హాజరు కమ్మని ఆర్డర్ వేశాను అన్న ఈవిడ.. ఇప్పుడు అదే విధంగా తమ పార్టీ డర్టీ ఎంపీ ని తన ముందు తక్షణమే హాజరు కావాలి అని ఎందుకు అనలేదు? రెండు రోజులుగా ప్రతిపక్షంలో ని మహిళలు అందరూ మహిళా కమీషన్ నిర్లిప్తతను ఎండగడుతూ ఉండటంతో, గత్యంతరం లేక, నేడు నింపాదిగా విచారణ జరపాలని ప్రభుత్వానికి లేఖ రాశారు అంతే.. ఇది రాష్ట్ర మహిళలను నయవంచనకు గురి చేయడమే.