రికార్డు స్థాయిలో రూ. 9.62 కోట్లు జరిమానా వసూలు చేసిన దక్షిణ మధ్య రైల్వే

– ఒక్కొక్క టికెట్ తనిఖీ సిబ్బంది ₹1 కోటి కి పైగా రికార్డు స్థాయిలో జరిమాన వసూలు
-దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే ఇదే తొలిసారి

రైళ్లలో అనధికారిక ప్రయాణాన్ని అరికట్టడానికి మరియు అధికారిక టికెట్ తో ప్రయాణించే రైలు ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించే దిశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే నిరంతరం విస్తృతంగా టికెట్ తనిఖీ డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టిక్కెట్ తనిఖీ సిబ్బంది నిర్విరామ కృషి ఫలితంగా జోన్‌లో టిక్కెట్ల అమ్మకాల పెంపు మెరుగుపరచడం జరిగింది .రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణించడం, అనధికారిక ప్రయాణం మరియు పరిమితికి మించిన లగేజీని బుక్ చేయకుండా ప్రయాణించే ప్రయాణికుల నుండి దక్షిణ మధ్య రైల్వే కు చెందిన తొమ్మిది మంది టిక్కెట్ తనిఖీ సిబ్బంది రికార్డు స్థాయిలో ఒకొక్క టికెట్ తనిఖీ అదికారి ఒక కోటి రూపాయలకు పైగా వసూలు చేయడం ద్వారా చరిత్ర సృష్టించారు.

తొమ్మిది మంది టికెట్ తనిఖీ సిబ్బంది వివిధ రైళ్లలో విస్తృతముగా తనిఖీలు నిర్వహించి 1.16 లక్షల అనధికారిక ప్రయాణికుల నుండి ఏకంగా రూ. 9.62 కోట్లు వసూలు చేయడం జరిగింది .
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో తొమ్మిది మంది టిక్కెట్ తనిఖీ సిబ్బంది ఎంతో అంకితభావంతో విధులు నిర్వర్తించడం ద్వారా విజయాన్ని సాధించి ఒక కోటి కోటి వసూలు చేసిన “వన్ క్రోర్ క్లబ్ ” లో స్థానం సంపాదించారు. వ్యక్తిగతంగా ఒక్కో టికెట్ తనిఖీ సిబ్బంది , అనధికారిక ప్రయాణికులనుండి జరిమానా రూపంలో రూ 1.0 కోటి ఆదాయం రాబట్టడం అనేది దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే ఇదే తొలిసారి.

ఈ విధులు నిర్వహించిన టికెట్ తనిఖీ సిబ్బందిలో సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఏడుగురు, గుంతకల్, విజయవాడ డివిజన్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. సీనియర్ డి సి ఎం సికింద్రాబాద్ డివిజన్‌ కు చెందిన చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ శ్రీ టి. నటరాజన్, టిక్కెట్ లేకుండా ప్రయాణించిన 12689 మంది ప్రయాణికులు / ఇర్రేగులర్ ( క్రమ రహిత ) టిక్కెట్లు గల ప్రయాణికులు మరియు పరిమితికి మించిన లగేజి ని అధికారికంగా బుక్ చేయకుండా తీసుకెళ్లడం ద్వారా అత్యధికంగా రూ ₹1.16 కోట్లు జరిమానా వసూలు చేసారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్, విధి నిర్వహణలో ఎంతో అంకితభావంతో ఆదర్శవంతమైన పని తీరును కనబర్చిన టికెట్ తనిఖీ సిబ్బందిని ప్రశంసించారు . టిక్కెట్ రహిత మరియు అనధికారిక ప్రయాణాన్ని అరికట్టడంలో నిరంతరం కృషి చేస్తున్న వాణిజ్య విభాగానికి చెందిన సిబ్బందిని ఆయన అభినందించారు. టికెట్ తనిఖీ అనేది ఒక నిర్దిష్టమైన విధానం అని, ఇది అధికారిక రైలు ప్రయాణీకులలో విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా టికెట్ రహిత ప్రయాణికులను అరికట్టేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. రైలు ప్రయాణికులందరూ చెల్లుబాటు అయ్యే రైల్వే టిక్కెట్ మరియు సరైన ప్రయాణ దృవీకరణ పత్రాలతో ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply