టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
నోటితో పొగిడి.. నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి యవ్వారం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ జగన్ బహిరంగ వేదికలపై ప్రేమ కురిపిస్తుంటే… క్షేత్రస్థాయిలో మాత్రం వైసిపి మూకలు ప్రతిరోజూ ఆయావర్గాలపై దాడులకు తెగబడుతూ అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయి. పెండ్లిమర్రులో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు శ్రీనివాసులు అనే బిసి యువకుడ్ని హత్యచేసి 24గంటలు కూడా గడవలేదు. తాజాగా నందికొట్కూరు పట్టణంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డి నమాజ్ కు వెళ్లివస్తున్న ముస్లిం మహిళను బురకా తొలగించి తీవ్రంగా అవమానించడమేగాక, అదేమని ప్రశ్నించిన నేరానికి ఆమె భర్త, కుమారుడిపై చెప్పుతో దాడికి తెగబడ్డాడు. అధికారమదంతో విర్రవీగుతున్న జగన్ అండ్ కో కు మరో 37రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కలసి ఘోరీ కట్టడం ఖాయం.