Suryaa.co.in

Andhra Pradesh

ఇచ్చిన మాట తప్పినందుకే ఫిబ్రవరి 10న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి

– ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్

ఓట్ల కోసం రాష్ట్రంలో యువతకు కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగులను నమ్మించిన మాట వాస్తవం కాదా?
ప్రతి ఏటా జనవరి నెలలో ఇస్తానన్న జాబ్ కేలండర్ ఇవ్వనందుకే నిరుద్యోగుల ఆందోళన. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన నిరుద్యోగులు జగన్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయి ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు.

ఉద్యోగాంధ్రప్రదేశ్ గా చేస్తానని యువతకు ఆశలు కల్పించి అవసరం తీరిపోయాక ఆత్మ హత్యల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు. యువతను మోసం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి.జాబ్ క్యాలెండర్ ను అడిగితే జాదూ క్యాలెండర్ను ఇచ్చిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ నోటిఫికేషన్ ప్రకటించకపోతే నిరుద్యోగుల సత్తా చూపిస్తాం. అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాల్సింది పోయి యువతను వెట్టిచాకిరి లోకి దింపారు.పోలీసు కానిస్టేబుల్,ఎస్సై ఉద్యోగాలు మరియు మెగా డీఎస్సీని తక్షణమే ప్రకటించాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, జూనియర్ మరియు డిగ్రీ లెక్చరర్స్, లైబ్రేరియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర నోటిఫికేషన్స్ ని తక్షణమే విడుదల చేయాలి.

LEAVE A RESPONSE